ఘనంగా మంత్రి కోమటిరెడ్డి జన్మదిన వేడుకలు

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 23 (డిగ్నిటి న్యూస్): రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం నల్లగొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల సమక్షంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్ తదితరులు కేక్ కట్ చేసి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిరంతరం పేదల సంక్షేమం, జిల్లా సమగ్రాభివృద్ధి కోసం పరితపించే నాయకుడని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »