RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

మా జోలికి వస్తే రాజకీయ సమాధి కడతాం!

కోమటిరెడ్డి సోదరులపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సంచలన వ్యాఖ్యలు ​సూర్యాపేట/తుంగతుర్తి, జూలై 24 (డిగ్నిటి న్యూస్): ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో అంతర్గత విభేదాలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. నల్గొండ జిల్లా రాజకీయాల్లో ప్రముఖులైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల తీరుపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన నియోజకవర్గంపై అనవసర జోక్యం చేసుకుంటూ తమ గౌరవానికి భంగం కలిగిస్తున్నారని, తమ జోలికి వస్తే ఊరుకునేది లేదని,…

నందవరం చౌడేశ్వరి అమ్మవారి ఉత్సవాలకు మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డికి ఆహ్వానం

నందవరం, జూలై 24 (డిగ్నిటీ న్యూస్): ప్రముఖ పుణ్యక్షేత్రం నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జూలై 27 నుండి 29 వరకు వైభవంగా జరగనున్న శాకాంబరీ ఉత్సవాలకు రావాల్సిందిగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి, ఆయన సతీమణి ఇందిరా రెడ్డిలను ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎన్. శ్రీనివాస రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పి.వి. కుమార్…

PDSU రాష్ట్ర అధ్యక్షుడు రఫీ ముందస్తు అరెస్టు ఘోరం

నంద్యాల, జూలై 24 (Dignity News): విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం తీవ్రంగా ఖండించదగిన విషయమని, ఇది ప్రజాస్వామ్య హక్కులను, రాజ్యాంగాన్ని పూర్తిగా కాలరాయడమేనని ప్రజాసంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాల పిలుపుమేరకు నేడు నిర్వహించిన విద్యాసంస్థల బంద్ నేపథ్యంలో తెల్లవారుజామున 4 గంటలకే పీడీఎస్‌యూ (PDSU) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు S.M.D. రఫీని నంద్యాల త్రీటౌన్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్…

పేదల పాలిట శ్రీరామరక్ష ‘గోళ్ళ రాజేష్’..

నంద్యాల, జూలై 24 (డిగ్నిటి న్యూస్):సామాజిక సేవే పరమావధిగా, నిరుపేదలు మరియు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రముఖ వ్యాపారవేత్త, సమాజ సేవకుడు గోళ్ళ రాజేష్ నంద్యాలలో అందిస్తున్న సేవలు అభినందనీయమని ఆయన ప్రతినిధి, సీనియర్ పాత్రికేయుడు నూర్ భాష కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు, నిరుపేద యువతీ యువకులు సొంత కాళ్లపై నిలబడి స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా గోళ్ళ రాజేష్ గురువారం తన కార్యాలయంలో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని…

నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

నంద్యాల, జూలై 21 (డిగ్నిటి న్యూస్): నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఎమ్‌డీ రఫీ డిమాండ్ చేశారు. ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడికి యత్నించిన విద్యార్థులు, ఉద్యమకారులపై పోలీసులు నిరంకుశంగా లాఠీచార్జ్ చేయడాన్ని, భాష్పవాయు గోళాలు ప్రయోగించడాన్ని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు….

నంద్యాలలో ఘనంగా వైద్య సదస్సు

నంద్యాల, జూలై 19 (డిగ్నిటి న్యూస్): నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో కర్నూలు కామినేని జెమ్ కేర్ క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్త నిర్వహణలో స్థానిక ఒక హోటల్ సమావేశ భవనంలో నంద్యాల ప్రాంత వైద్యులకు నిరంతర వైద్య విద్యా సదస్సు నిర్వహించారు. ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన, కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఐఎంఏ జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ముఖ్యఅతిథిగా…

న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) లోకి ఐఎఫ్టియు, రైతుకూలీ సంఘం నాయకులు

వెలుగోడు, జూలై 19 (డిగ్నిటి న్యూస్): అఖిల భారత రైతు కూలి సంఘం (AIKMS) జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ B.ఆనంద్ తన అనుచరులతో కలిసి సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గంలో అధికారికంగా చేరారు. వెలుగోడులో ఆదివారం నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు కామ్రేడ్ రఫీ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు పి. లజరాస్ హాజరై కామ్రేడ్ ఆనంద్‌కు అభినందనలు తెలిపారు.ఈ…

వ్యక్తిగత దూషణలు మాని ప్రజా సమస్యలపై మాట్లాడాలి

ఎమ్మిగనూరు, జూలై 18 (డిగ్నిటి న్యూస్): రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు మాని, ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఎమ్మిగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత వారం రోజులుగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు వైఎస్ఆర్‌సీపీ నాయకులపై అనుచిత, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు.ప్రజలకు చేయాల్సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడకుండా…