యాగంటి (నంద్యాల), అక్టోబర్ 11 (డిగ్నిటి న్యూస్): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ (APERC) చైర్మన్ పి. వెంకట రమణ రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆయనకు ఆలయ చైర్మన్ బండి మౌళీశ్వర్ రెడ్డి, ఈవో పాండురంగా రెడ్డి ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాన్ని అందజేశారు. అదేవిధంగా, హైదరాబాద్‌కు చెందిన చండ్ర బసవయ్య…
ఏపీడబ్ల్యూజేఎఫ్ చలో కలెక్టరేట్ అక్టోబర్ 14కు వాయిదా
నంద్యాల: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు మరియు ఇతర సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసినట్లు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (APWJF) నంద్యాల జిల్లా కమిటీ ప్రతినిధులు తెలిపారు. అంతకుముందు నిర్ణయించిన ప్రకారం ఈ నెల 12వ తేదీన కలెక్టర్‌ను కలవాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 14కు మార్చినట్లు వెల్లడించారు. ఈ మార్పును గమనించి ఏపీడబ్ల్యూజేఎఫ్…
సంజామల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి: జనసేన నాయకులు రాజు
సంజామల: సంజామల మండలంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జనసేన పార్టీ నాయకుడు రాజు ఆందోళన వ్యక్తం చేశారు. సాగునీరు అందక, పంటలు పండక రైతులు ఆర్థికంగా కుదేలవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మండలంలో అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన చేయించాలని కోరారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకూ తగిన నష్టపరిహారం అందించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తీవ్ర ప్రతికూల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని…
సుధీర్ శర్మ బృందం ఆధ్వర్యంలో 150 మంది పితృదేవతలకు తర్పణాలు
నంద్యాల: నంద్యాల జిల్లా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సామాజిక ఐక్యత, సాంప్రదాయాల పరిరక్షణే లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. మహాలయ అమావాస్యను పురస్కరించుకుని సంఘం ఉపాధ్యక్షుడు సుధీర్ శర్మ బృందం ఆధ్వర్యంలో శనివారం సుమారు 150 మంది పితృదేవతలకు తర్పణాలు వదిలి, వారికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. సంస్కృతీ సాంప్రదాయాలలో పితృదేవతలకు తర్పణాలు సమర్పించడం ఎంతో విశిష్టమైనదని, పూర్వీకులను స్మరించుకుంటూ వారి ఆశీస్సులు పొందాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు సుధీర్ శర్మ తెలిపారు. నంద్యాల చరిత్రలోనే…
కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి: వామపక్షాల డిమాండ్
నంద్యాల: కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ ఎన్నికలలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఇసి) జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నంద్యాలలో శనివారం వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యాలయం నుండి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మీదుగా సాయిబాబా నగర్ వరకు సీఈసీ శవయాత్ర నిర్వహిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. నాగరాజు, రైతు సంఘం…
ఏకలవ్య విద్యార్థుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహణ
నల్లగొండ: నల్లగొండలోని ఏకలవ్య పాఠశాల ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలను విద్యార్థులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి హాజరైన పాఠశాల చైర్మన్ అలుగుబెల్లి కరుణాకర్ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ మారం శ్రీనివాస రెడ్డి మరియు ప్రిన్సిపాల్ హరిప్రసాద్‌లు విద్యార్థుల ప్రతిభను విశేషంగా అభినందించారు. బతుకమ్మ పండుగ విశిష్టతను, తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను ఈ సందర్భంగా విద్యార్థులకు వివరించి, పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం…
మిగిలిన మద్యం దుకాణాలకు నూతన గెజిట్ విడుదల: ఎక్సైజ్ శాఖ అధికారి ప్రకటన
నంద్యాల: నంద్యాల జిల్లాలో మిగిలిపోయిన మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు కోసం శనివారం ప్రత్యేక గెజిట్ విడుదల చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎస్ రవికుమార్ తెలిపారు. ఓపెన్ కేటగిరీ కింద సిరివెళ్ల, ఆళ్లగడ్డ రూరల్, బేతంచెర్ల రూరల్, నందికొట్కూరు రూరల్, ఆత్మకూరు మున్సిపాలిటీ, ఆత్మకూరు రూరల్ మరియు కొత్తపల్లి మండలాల్లో మొత్తం 7 షాపులకు (గెజిట్ నంబర్: 155), అలాగే పగిడ్యాల మండలంలో గౌడ కులస్తుల కోసం కేటాయించిన ఒక షాపునకు (గెజిట్…
ఎస్ఐఆర్ పేరుతో కోట్లాది ఓట్ల తొలగింపు.. కేంద్ర ఎన్నికల అధికారి రాజీనామా చేయాలి
నంద్యాల: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారంటూ సీపీఐ, కాంగ్రెస్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నంద్యాలలోని సంజీవనగర్ సెంటర్‌లో శనివారం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ఆయన చిత్రపటం, బ్యానర్లను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, పట్టణ…
బహుజనులకు రాజకీయ అధికార దిశను చూపించిన నాయకుడు కాన్షీరామ్
అనంతపురం, అక్టోబర్ 9 (డిగ్నిటి న్యూస్): బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షీరామ్ 20వ వర్ధంతి సభను శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో రాయలసీమ జోన్ స్థాయిలో ఘనంగా నిర్వహించారు. అంతకుముందు ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల వద్ద ఉన్న కాన్షీరామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశానికి బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందనూరు నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి గద్దల నాగభూషణం అధ్యక్షత వహించగా, అనంతపురం…
ఎమ్మెల్యే గౌరు చరితమ్మ హయాంలోనే గ్రామాల అభివృద్ధి: పంట దిలీప్ కుమార్ రెడ్డి
గడివేముల: టీడీపీ ప్రభుత్వం మరియు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితమ్మ హయాంలోనే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని మండల టీడీపీ అధ్యక్షుడు పంట దిలీప్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బుజనూరు, గ్రంధివేముల గ్రామాల్లో ఎల్ నినో ప్రభావంతో తలెత్తిన తాగునీటి ఎద్దడిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, గౌరు కుటుంబ సభ్యులు జిందాల్ (JSW) యాజమాన్యంతో మాట్లాడి రెండు గ్రామాల్లో బోర్లను వేయించారని తెలిపారు. ఈ బోర్లలో 2.5 నుంచి 4 అంగుళాల…










