RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
13-10-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

జనసేన పార్టీ కార్యాలయంలో కాపునాడు ఉపాధ్యక్షులు దొంతుల కిషోర్‌కు ఘన సత్కారం

నంద్యాల: జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షులు దొంతుల కిషోర్ నాయుడిని జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్‌లు గురువారం శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దొంతుల కిషోర్ నాయుడు మాట్లాడుతూ.. నంద్యాలలో రాచమడుగు చందు, సుందర్‌లు తమ సొంత నిధులతో జనసేన పార్టీ కార్యాలయాన్ని నడిపిస్తూ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. క్షేత్రస్థాయి నాయకులను ఏకతాటిపైకి తెస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న వారి…

తాడిపత్రి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎం. చంద్రశేఖర్

తాడిపత్రి / అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రి డీఎస్పీగా శ్రీ ఎం. చంద్రశేఖర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను డిగ్నిటి న్యూస్ తెలుగు దినపత్రిక అనంతపురం ప్రతినిధి కృష్ణంరాజు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి డిగ్నిటి న్యూస్ తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ అంకితభావంతో విధులు నిర్వహిస్తానని డీఎస్పీ చంద్రశేఖర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

లక్ష్మీ హాస్పిటల్‌లో ఉచిత కంటి, బీపీ పరీక్షల శిబిరం

పామిడి, అక్టోబర్ 8 (డిగ్నిటి న్యూస్): ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం పామిడిలోని లక్ష్మీ హాస్పిటల్‌లో ఉచిత కంటి మరియు రక్తపోటు (బీపీ) పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ జోనల్ చైర్‌పర్సన్ లయన్ డాక్టర్ నల్లపాటి తిరుపతి నాయుడు, జిల్లా చైర్మన్ లయన్ పి.ఎస్. జయరామరావు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పట్రా శ్రీనివాసులు, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ అంజి నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు…

గుంతకల్లు సబ్ డివిజన్‌లో ముమ్మరంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్

అనంతపురం: జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గుంతకల్లు సబ్ డివిజన్‌ పరిధిలో పోలీసులు గురువారం విస్తృత కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు మాదకద్రవ్యాల కట్టడి లక్ష్యంగా ఈ ముందస్తు తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 5 పోలీస్ స్టేషన్ల పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలు, గ్రామాల్లో సుమారు 350 ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు….

విదేశీయుల వసతి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం తప్పనిసరి: ఎస్పీ

అనంతపురం: వివిధ పనుల నిమిత్తం అనంతపురం జిల్లాకు వచ్చే విదేశీ పౌరుల వసతి వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్ స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లాలోని హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్ హౌస్‌లు, విద్యాసంస్థలు మరియు ఆసుపత్రుల నిర్వాహకులకు గురువారం మార్గదర్శకాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం విదేశీయులకు వసతి కల్పించే ముందు వారి పాస్‌పోర్ట్, వీసా వివరాలను పరిశీలించి, ఫారమ్-సి (FORM C)…

జిల్లా ఎస్పీ పి. జగదీష్‌ను కలిసిన నూతన రూరల్ ఎస్డీపీఓ అశ్విన్ మణిదీప్

అనంతపురం: అనంతపురం రూరల్ నూతన సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఏఎస్పీ అశ్విన్ మణిదీప్ ఐపీఎస్ గురువారం జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ కార్యాలయంలో ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు ప్రజల సమస్యలపై త్వరితగతిన స్పందించడం వంటి అంశాలపై ఎస్పీ పలు సూచనలు చేశారు. గతంలో ఇదే జిల్లాలో ట్రైనీ ఐపీఎస్…

టీబీ ముక్త్ పంచాయతీగా రసూల్‌పురం

– సర్పంచ్ గుండెబోయిన వెంకన్న యాదవ్‌కు అభినందనలు నల్గొండ: నల్లగొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ‘టీబీ ముక్త్ పంచాయతీ’గా ఎంపికైన రసూల్‌పురం గ్రామపంచాయతీ సర్పంచ్ గుండెబోయిన వెంకన్న యాదవ్‌ను గురువారం జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మరియు ఇతర ఉన్నతాధికారులు ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. గ్రామాన్ని క్షయ (టీబీ) రహితంగా తీర్చిదిద్దడంలో సర్పంచ్ మరియు గ్రామ యంత్రాంగం చూపిన చొరవను, చేసిన కృషిని ఈ సందర్భంగా కలెక్టర్ మరియు ఎమ్మెల్సీ…

శ్రీశైలంలో అక్టోబర్ 11 నుండి దసరా మహోత్సవాలు

శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నట్లు దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, ఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా శ్రీస్వామిఅమ్మవార్లకు కైంకర్యాలు, వైదిక కార్యక్రమాలను సమయపాలనతో పూర్త్యయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. లోకక్షేమం కోసం ఈ ఏడు సహస్ర చండీపారాయణ సహిత శతచండీ మహారుద్రయాగాన్ని నిర్వహిస్తున్నామని, ప్రతిరోజూ నవదుర్గ అలంకరణలు, వివిధ వాహనసేవలు ఉంటాయని వివరించారు. ఈ…

ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా మైలేరి సురేఖ నియామకం: నాదెండ్ల మనోహర్‌కు ధన్యవాదాలు

తెనాలి/మంగళగిరి: ఆళ్లగడ్డ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా మైలేరి సురేఖను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పీఏసీ చైర్మన్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరిని మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆళ్లగడ్డ మార్కెట్ కమిటీ బాధ్యతలను జనసేన పార్టీకి కేటాయించి, మైలేరి…

యూపీఐ లావాదేవీలపై వ్యాపారుల్లో వ్యక్తమవుతున్న సందేహాలు

నంద్యాల: హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సంస్థలలో యూపీఐ (డిజిటల్) చెల్లింపులకు సంబంధించిన మార్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) నిబంధనలపై వ్యాపారులలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే యూపీఐపై ప్రభుత్వం కొత్తగా ఎలాంటి పన్ను విధించలేదని, ఎండీఆర్ అనేది ప్రభుత్వ పన్ను కాదు చెల్లింపుల వ్యవస్థలోని బ్యాంకులు, యాప్‌లకు సంబంధించిన రుసుమని స్పష్టత ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. చిన్న వ్యాపారులకు నెలకు రూ.లక్ష వరకు యూపీఐ వసూళ్లపై శూన్య (జీరో) ఎండీఆర్ వర్తిస్తుంది. రూ.2,000 వరకు…