RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశం

  • హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కలిసిన నంద్యాల నేత దొడ్ల సురేష్

మంగళగిరి, జూన్ 28 (డిగ్నిటి న్యూస్): మంగళగిరిలోని సికే కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ సమావేశం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంట్ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ సభ్యుడు దొడ్ల సురేష్ చౌదరి అక్కడకు చేరుకుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

అలాగే కమిటీ అధ్యక్షులు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి, మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావులను కూడా ఆయన కలిసి పలు అంశాలపై చర్చించారు.అనంతరం సురేష్ చౌదరి మాట్లాడుతూ.. ఈనెల 29వ తేదీ (సోమవారం) నుంచి ప్రారంభం కానున్న జనసేన పార్టీ జిల్లా, నియోజకవర్గ స్థాయి కమిటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం గురించి సమావేశంలో వివరంగా తెలుసుకున్నట్లు చెప్పారు. రేపటి నుంచి ప్రారంభం కాబోయే ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో జనసేన పార్టీ నాయకులు, క్రియాశీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, తమ పరిధిలోని పదవులకు దరఖాస్తులు సమర్పించుకోవాలని ఆయన కోరారు. పార్టీ బలోపేతానికి ఈ కమిటీలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్న ఆయన.. తమకు ఈ అవకాశం కల్పించిన ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

CHIRRABOINA RAMA RAO YADAV
CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully