ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీద దాడి చేయబోయిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆలేరులో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయట్లేదు అంటూ విమర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నఒక్కసారిగా స్టేజి మీదకు దూసుకొచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను ఆపే ప్రయత్నం చేసిన పోలీసులుపరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో అక్కడి నుండి పారిపోయిన మల్లన్నఅయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మధ్య విభేదాల నేపథ్యంలో ఎమ్మెల్యే నే కార్యకర్తలను ఉసిగొల్పి ఉండొచ్చు…
జర్నలిజంపై ‘నాయర్’ అరాచకం.. నంద్యాల విలేకరుల నిప్పులు!
నంద్యాల, మే 3 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): అనంతపురంలో విలేకరిపై మనీషా నాయర్ సాగించిన అరాచక పర్వంపై నంద్యాల పాత్రికేయ లోకం భగ్గుమంది. సమాజానికి దిక్సూచిగా ఉండాల్సిన నాలుగో స్తంభాన్ని నిలువునా వణికించిన తీరును నంద్యాల పాత్రికేయులు సి.ఎం. నాగేంద్ర, హనుమతులు తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం నాడే జర్నలిస్టుల బతుకులు వీధిన పడటం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని వారు మండిపడ్డారు.ఒక కాలేజీని నడుపుతూ విద్యావంతురాలిగా చెలామణి అవుతున్న మహిళ, చట్టంపై కనీస గౌరవం లేకుండా…
నల్లగొండ జిల్లా బ్రేకింగ్: మిర్యాలగూడలో గోవా క్యాసినో కల్చర్ తీసుకువచ్చిన ఓ ప్రతినిధి.! ఎండలో కూడా ACలో పేకాట పార్టీలు!
మిర్యాలగూడలో కొత్త డ్రామా మొదలైంది. గోవా వెళ్లాల్సిన పనిలేదు.!క్యాసినో స్టైల్ పేకాట ఇక ఇక్కడే అంటూ BRS యువ కౌన్సిలర్ సీక్రెట్ స్కీమ్ పెట్టేశాడట…జిల్లాలో ఎండలు బాగా దంచి పడుతుంటే.. లోపల AC రూముల్లో పేకాట సెంటర్లు కూల్ సమ్మర్ కూల్ అనేలా గోవా లాంటి కేసినో ఏర్పాటు చేశాడు ఆ ప్రతినిధి! ప్రతి రోజు లక్షలు కాసులు తిప్పుతూ, సుమారు 2 లక్షల వరకు కట్ తీసుకుంటూ ఈ పేకాట స్థావరాలు నడిపిస్తున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి…ఖరీదైన…
రైతన్నల గోస పట్టదా..?నకిరేకల్ ధాన్యం కేంద్రాన్ని సందర్శించిన చిరుమర్తి లింగయ్య
నకిరేకల్, మే 3 (డిగ్నిటి న్యూస్): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతుల జీవితాలు అంధకారంలోకి నెట్టబడ్డాయని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. ఆదివారం నకిరేకల్ పట్టణం మూసీ రోడ్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి, కల్లాల్లో రోజుల తరబడి వేచి చూస్తున్న రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నకిరేకల్ నియోజకవర్గంలో పరిస్థితులు మరీ…
మార్కెట్ కమిటీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: నాగేంద్రప్ప
కర్నూలు, మే 3 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఔట్‌సోర్సింగ్ యార్డ్ అసిస్టెంట్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప డిమాండ్ చేశారు. కర్నూలు మార్కెట్ యార్డులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1994 నుంచి రెగ్యులర్ నియామకాలు లేకపోయినా, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తూ ప్రభుత్వానికి ఏటా రూ.700 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూరుస్తున్నారని తెలిపారు.ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వీరికి…
నంద్యాల రాజకీయాల్లో కీలక పరిణామం.. ఆవాజ్‌కు బాబుల్లా గుడ్‌బై… తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యం.. మంత్రి ఫరూక్ సమక్షంలో రాజకీయ ప్రస్థానం
నంద్యాల, మే 3 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): నంద్యాల జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పట్టణంలో దశాబ్ద కాలంగా పేదలు, మైనారిటీల పక్షాన గళం వినిపిస్తూ, సేవా కార్యక్రమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆవాజ్ కమిటీ నాయకుడు ఎస్.ఏ. బాబుల్లా ఆ సంస్థకు రాజీనామా చేశారు. సామాజిక సేవా రంగం నుంచి రాజకీయ రంగంలోకి తన ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తూ, తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అంకితం కావాలనే ఉద్దేశంతో ఆయన ఈ…
రేపు శ్రీశైల దేవస్థానం ఆస్పత్రిలో సాధారణ ఓపీ సేవలే…
శ్రీశైలం, మే 3 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): శ్రీశైల దేవస్థానం వైద్యశాలలో సోమవారం (మే 4న) కేవలం సాధారణ ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఈవో ఎం.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్పత్రిలో విధులు నిర్వహించే అపోలో వైద్యులు పరీక్షల నిమిత్తం సెలవుపై వెళ్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కేవలం పారామెడికల్ సిబ్బంది మాత్రమే విధుల్లో ఉంటారని, అత్యవసర వైద్యం అవసరమయ్యే స్థానికులు, యాత్రికులు స్థానిక మండల ప్రాథమిక ఆరోగ్య…
నోస్ట్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్య తీసుకోవాలి: ప్రజా పోరాట సమితి డిమాండ్
చిట్యాల, ఏప్రిల్ 3 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): నెల వ్యవధిలోనే రెండుసార్లు ప్రమాదాలు జరిగిన నోస్ట్ ఫార్మా ఫ్యాక్టరీ స్థితిగతులపై స్పెషల్ మెజిస్ట్రేట్‌తో విచారణ జరిపించి, యాజమాన్యంపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నూనె వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఆదివారం చిట్యాల మండలం పిట్టంపల్లి పరిధిలోని సదరు కంపెనీ గేటు వద్ద ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల ఇన్‌స్పెక్టర్లు, కాలుష్య నియంత్రణ మండలి…
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
బనగానపల్లె, మే 3 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి ప్రాణాలు వదిలిన విషాద సంఘటన బనగానపల్లె రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానిక రైల్వే పోలీసుల కథనం ప్రకారం శనివారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఒక్కసారిగా పట్టాలపైకి వచ్చి పడుకున్నాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన రైలు కింద పడటంతో సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు, రైల్వే సిబ్బంది వెంటనే…





