
శ్రీశైలం, మే 3 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): శ్రీశైల దేవస్థానం వైద్యశాలలో సోమవారం (మే 4న) కేవలం సాధారణ ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఈవో ఎం.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్పత్రిలో విధులు నిర్వహించే అపోలో వైద్యులు పరీక్షల నిమిత్తం సెలవుపై వెళ్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కేవలం పారామెడికల్ సిబ్బంది మాత్రమే విధుల్లో ఉంటారని, అత్యవసర వైద్యం అవసరమయ్యే స్థానికులు, యాత్రికులు స్థానిక మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. తిరిగి మే 5వ తేదీ ఉదయం నుంచి అన్ని రకాల వైద్య సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన వివరించారు.
