RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

SIR ఫారాల భర్తీపై గొల్లగూడెంలో అవగాహన

– ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి: సర్పంచ్ లక్ష్మీ సత్యనారాయణ

నకిరేకల్, జూన్ 27 (డిగ్నిటి న్యూస్): నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో శనివారం స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రజలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఒక నిర్దిష్ట ప్రక్రియకు సంబంధించిన ఫారాలను ఎలా నింపాలి, వాటిని ఎందుకు నింపాలి అనే విషయాలపై గ్రామ ప్రజలకు కూలంకషంగా వివరించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ దీనిపై పూర్తి అవగాహన పెంచుకోవాలని, అలాగే దీని గురించి తెలియని ఇతర గ్రామస్థులకు కూడా వివరించి చెప్పాలని కోరారు.అనంతరం గ్రామ సర్పంచ్ లక్ష్మీ సత్యనారాయణ మాట్లాడుతూ.. గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ ప్రక్రియపై స్పష్టత ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు పరమేశ్వరి, పూర్ణ, గంటి వెంకన్నలతో పాటు బిఎల్ఓ జ్యోతి, బిఎల్ఎ చిర్రబోయిన శ్రీను పాల్గొన్నారు. అలాగే ముక్కామల వెంకన్న, చిర్రబోయిన పోల్రాజు, వీరయ్య, పరమేశ్, బింగి ఎల్లయ్య, కొమ్మనమైన సైదులు, బింగి పెద్దలు, ముక్కామల లింగయ్య, బింగి సైదులు, చిర్రబోయిన కలమ్మ, కొమ్మనబోయిన చంద్రమ్మ, చిర్రబోయిన లింగయ్య తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

CHIRRABOINA RAMA RAO YADAV
CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully