RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
13-10-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షునికి సన్మానం

బనగానపల్లె: బనగానపల్లె పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) నూతన జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన జి. మద్దయ్య యాదవ్‌ను గురువారం ఘనంగా సన్మానించారు. అఖిలభారత యాదవ మహాసభ మండల అధ్యక్షుడు ఘన మద్దిలేటి యాదవ్, ప్రధాన కార్యదర్శి శంకర్ యాదవ్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మద్దయ్య యాదవ్‌కు శాలువా కప్పి పూలమాలలతో గౌరవించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యాదవులు విద్యా, ఉద్యోగ, రాజకీయ…

రజకుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం

నంద్యాల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా రజక విభాగం అధ్యక్షుడిగా ఆల్వకొండ మద్దిలేటి ఎంపికయ్యారు. దశాబ్దాలుగా రజకుల అభ్యున్నతి, హక్కులు, ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతూ ఆయన చేసిన సేవలను గుర్తించి పార్టీ అధిష్ఠానం ఈ బాధ్యతలను అప్పగించింది. ఈ సందర్భంగా మద్దిలేటి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్…

వీఆర్ఏల నిరవధిక ధర్నా 23వ రోజుకు చేరిక

బనగానపల్లె: తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నంద్యాల జిల్లా బనగానపల్లె ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక ధర్నా గురువారానికి 23వ రోజుకు చేరుకుంది. 23 రోజులుగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై వీఆర్ఏ సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పే స్కేలు అమలు చేయాలని, నామినీ వీఆర్ఏలందరికీ ఒకేసారి ఉద్యోగ నియామకాలు కల్పించాలని, అర్హులకు 70 శాతం ప్రమోషన్లు ఇవ్వాలని మరియు విధి నిర్వహణలో మృతి చెందిన వీఆర్ఏల కుటుంబాలకు…

పున్న కైలాస్ నేతకు ఎమ్మెల్సీ ఇవ్వాలి: బీసీ, పద్మశాలి సమాజం

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా విద్యార్థి, తెలంగాణ ఉద్యమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన బీసీ నాయకుడు, పద్మశాలి సమాజ ప్రతినిధి పున్న కైలాస్ నేతకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని బీసీ, పద్మశాలి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ బాటలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కైలాస్ నేత విశేష కృషి చేశారని, అలాగే కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో గాంధీ భవన్ కేంద్రంగా అండగా నిలిచారని గుర్తుచేశారు. దాసోజు శ్రవణ్, చెరుకు సుధాకర్…

మద్యం షాపుల టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలి: ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ టి. నాగలక్ష్మి

కర్నూలు: ఏపీ మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ మరియు నోటిఫికేషన్‌లో భాగంగా కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయాన్ని జాయింట్ కమిషనర్ టి. నాగలక్ష్మి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటిన ఆమె, అనంతరం ఎక్సైజ్ స్టేషన్‌ను సందర్శించి మద్యం షాపుల టెండర్ దరఖాస్తుల పురోగతిపై సమీక్షించారు. అనంతరం సర్కిల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ, టెండర్ ప్రక్రియపై విస్తృత అవగాహన కల్పించి వ్యాపారుల నుంచి అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చేలా…

దామ గట్లలో పొలం బాట పట్టిన నందికొట్కూరు ఎమ్మెల్యే…. గిత్త.

నందికొట్కూరు: నందికొట్కూర్ మండలంలోని దామగట్ల గ్రామంలో పల్లె పండగ3.0 కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతున్న శాసనసభ్యులు గిత్త జయ సూర్య రోడ్డు పక్కన పచ్చి మిరప పంట పొలంలో పచ్చిమిరప కాయలు కోస్తున్న వ్యవసాయ కూలీలతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న పొలం యజమానులతో పంట సాగు పెట్టుబడులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఏడాది రైతులు సాగు చేసుకుంటున్నా పంటలకు ఎలినో ప్రభావంతో ఎండల ప్రభావం…

రాష్ట్రస్థాయి జూడో పోటీలకు శ్రీ నవనంది హై స్కూల్ విద్యార్థుల ఎంపిక.

నందికొట్కూర్: రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ జూడో పోటీలకు నందికొట్కూరు పట్టణానికి చెందిన శ్రీ నవనంది హై స్కూల్ విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ బద్దుల శ్రీధర్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా బద్దుల శ్రీధర్ రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ప్రధమ స్థానంలో ఎంపికైన విద్యార్థులు ఏ. హిమ తేజ, కే. వినయ్ కుమార్ లను అభినందించారు. జిల్లాస్థాయిలో జరిగిన జూడో అండర్19, – 50 కేజీల విభాగంలో ఏ.హిమతేజ, కే వినయ్ కుమార్ అండర్14, –…

ఏవీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు: అంధుల పాఠశాలలో అన్నదానం, గోసేవ

నంద్యాల: ఏపీ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (సీడ్స్ కార్పొరేషన్) మాజీ చైర్మన్, సీనియర్ టీడీపీ నాయకులు ఏవి సుబ్బారెడ్డి జన్మదినం సందర్భంగా బుధవారం నంద్యాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఏవీ యూత్ అధ్యక్షుడు లక్ష్మీకాంతారెడ్డి ఆధ్వర్యంలో హెల్పింగ్ హాండ్స్ సొసైటీ ప్రతినిధి ఎస్. చంద్రశేఖర్ రెడ్డితో కలిసి పోలూరు రోడ్డులోని జీవన్ జ్యోతి అంధుల పాఠశాల విద్యార్థులకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో మూడు పూటలా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే ఎస్‌బీఐ కాలనీలోని గోశాలలో…

2 లక్షల వైద్య సాయం

హైదరాబాద్ / నల్గొండ: రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పనిగిరి గ్రామానికి చెందిన మూగ, చెవిటి దంపతులు జంపాల మహేష్‌ కుమార్‌, రజితలకు పుట్టిన చిన్నారికి కూడా మూగ, చెవిటి తనం రావడంతో, మెరుగైన వైద్యం అందిస్తే నయమవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబం మంత్రిని ఆశ్రయించగా, తక్షణమే స్పందించిన మంత్రి కోమటిరెడ్డి చిన్నారిని…

దళిత మహిళపై దాడి కేసు: నిందితుడి అరెస్ట్

నల్గొండ, అక్టోబర్ 7 (డిగ్నిటి న్యూస్): నల్గొండ జిల్లా పీకే మల్లేపల్లిలో గ్రామసభ సందర్భంగా మాజీ వీఓఏ, దళిత మహిళ మాధవిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటనలో ప్రధాన నిందితుడు అమర్‌నాథ్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పొదుపు సంఘాల డబ్బుల వివాదంలో గ్రామసభలో మహిళపై దుర్భాషలాడుతూ, చెంప పగలగొట్టి జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది. ఈ ఘటనపై స్పందించిన స్థానిక పోలీసులు బాధితురాలి ఫిర్యాదు…