RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

ఈఏపీసెట్‌ ఫలితాల్లో ‘రావుస్’ ప్రభంజనం

  • అగ్రికల్చర్ విభాగంలో రాష్ట్ర స్థాయి 82వ ర్యాంకు కైవసం: చైర్మన్ అప్పారావు, డైరెక్టర్ మోని చంద్ర

నంద్యాల, జూలై 2 (డిగ్నిటి న్యూస్): ఇటీవల విడుదలైన ఏపీ ఈఏపీసెట్‌-2026 ఫలితాల్లో రావుస్ విద్యాసంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులతో సరికొత్త రికార్డు సృష్టించారని కళాశాల చైర్మన్ యం.వి. అప్పారావు, డైరెక్టర్ మోని చంద్ర సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా అగ్రికల్చర్ విభాగంలో కళాశాల విద్యార్థి రాష్ట్ర స్థాయి 82వ ర్యాంకు సాధించి అద్భుత ప్రతిభ కనబరిచారని, అలాగే 635వ ర్యాంకుతో పాటు ఎం. వైష్ణవి 717వ ర్యాంకు సాధించి సంస్థ కీర్తిని చాటారని వారు పేర్కొన్నారు. ఇంజినీరింగ్‌ విభాగంలోనూ ఏ. తిరుమంజరి (1696), ఎస్‌. లక్ష్మి ప్రసన్న (1859), ఎస్‌. చరణ్ తేజ (3221), ఎస్‌. కార్తీక్ (3269) ఉత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారని వివరించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ మోని చంద్ర మాట్లాడుతూ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 1000 లోపు ముగ్గురు, 5000 లోపు 10 మంది.. అలాగే ఇంజినీరింగ్‌లో 2000 లోపు ఇద్దరు, 5000 లోపు నలుగురు విద్యార్థులు నిలిచారని తెలిపారు. రెండు విభాగాల్లో కలిపి 15000 లోపు అత్యధికంగా 46 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని వెల్లడించారు. కళాశాల ప్రారంభం నుంచే ప్రత్యేక ఈఏపీసెట్‌ కోచింగ్ ఇవ్వడం, ప్రతి సోమవారం పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడమే ఈ ఘన విజయానికి కారణమని యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ రోడ్డ సుంకయ్య, డి. జగదీష్ రావు, సంఘమహేస్వరయ్య, నారాయణ స్వామి పాల్గొని విద్యార్థులను అభినందించారు.

CHIRRABOINA RAMA RAO YADAV
CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully