చర్లపల్లి సంచార బస్తీలో న్యాయ అవగాహన సదస్సు

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 23 (డిగ్నిటి న్యూస్): నల్లగొండ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు శనివారం చర్లపల్లి ప్రాంతంలోని సంచార బస్తీలో “సురక్షిత్ బచ్పన్ – సురక్షిత్ భవిష్య” కార్యక్రమంలో భాగంగా న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బాలల హక్కులు, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధం, మహిళలు మరియు పిల్లల రక్షణకు సంబంధించిన వివిధ చట్టాలపై స్థానిక ప్రజలకు సమగ్రంగా అవగాహన కల్పించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాలల భద్రత, వారి హక్కుల పరిరక్షణకు బాధ్యతగా నిలవాలని, చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండటం ద్వారానే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ సదస్సులో వారికున్న పలు అనుమానాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్ భీమనపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »