RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

ఎస్.కొత్తూరు ఆలయానికి 70 వేల విరాళం

పాణ్యం, మే 23 (డిగ్నిటి న్యూస్): మండలంలోని ప్రముఖ శైవక్షేత్రమైన ఎస్.కొత్తూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి శనివారం 70 వేల విరాళం అందినట్లు ఆలయ ఈవో యం.రామక్రిష్ణ తెలిపారు. ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన చిన్న జగదీష్, గీత దంపతులు తమ ఇలవేల్పు అయిన స్వామివారికి మొక్కుబడి కింద ఈ విరాళాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా దాతల కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో స్వామివారి అభిషేకం, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వ మంటపంలో వారికి శేష వస్త్రాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సురేష్ శర్మ, గ్రామ పెద్దలు మిలిటరీ సుబ్బారెడ్డి, ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Chintha Yadaiah
Chintha Yadaiah
Reporter
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully