RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

సుందరయ్య నేటి తరానికి ఎంతో ఆదర్శం

ఘనంగా 41వ వర్ధంతి

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 19. (డిగ్నిటీ న్యూస్). స్వాతంత్ర సమరయోధులు దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి ఎంతో ఆదర్శనీయమని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు.మంగళవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా 42,47వ డివిజన్ ఆర్టీసీ కాలనీలో తుమ్మల వీరారెడ్డి , 43వ డివిజన్లో డాక్టర్స్ కాలనీలో ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం సిపిఎం జండావిష్కరణలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో విలువలు కలిగి నిరాడంబరంగా పార్లమెంటు సభ్యుడిగా, శాసనసభ పక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన నాయకుడు అని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమగ్ర నీటి సరఫరా విధానంపై ఒక పుస్తకము రాసి వివరణాత్మకంగా వివరించడం జరిగిందని అన్నారు.

దోపిడీకి వ్యతిరేకంగా తమ ఇంటి నుండే ఉద్యమం ప్రారంభించిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. తన భూమిని పేదలకు పంచి భూ పంపిణీ జరగాలని, కష్టించి పనిచేసే వాళ్లకు కూలి గిట్టుబాటు కావాలని కూలి -భూమి పోరాటాలు నడిపిన వీర యోధుడు కామ్రేడ్ సుందరయ్య అని అన్నారు. స్వాతంత్ర పోరాటంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారు దేశాన్ని వదిలి వెళ్లాలని విద్యార్థి దశ నుండే ఉద్యమాల్లో పాల్గొన్న నాయకుడు అని అన్నారు నేడు సామ్రాజ్యవాదం పెరిగిపోయి ఇతర దేశాలపై యుద్ధాలు ప్రకటిస్తూ అశాంతికి కారణం అవుతున్న అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నేడు ఆయన స్ఫూర్తితో పోరాటాలు నడపాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు ఆయన ఆదర్శాలు నేటి తరం పాటిస్తూ వారు కోరుకున్న దోపిడీ లేని సమ సమాజ నిర్మాణానికి కంకణ బద్ధులు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హశం, పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, తుమ్మల పద్మ,ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి అనంతుల శంకరయ్య, తిప్పర్తి మండల కార్యదర్శి మన్నెం బిక్షం, నల్లగొండ పట్టణ కమిటీ సభ్యులు కుంభం కృష్ణారెడ్డి, అవుట రవీందర్, దండెంపల్లి సరోజ, గాదె నరసింహ, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, అద్దంకి నరసింహ, ఊట్కూరు మధుసూదన్ రెడ్డి, గుండాల నరేష్, కందుల అశోక్, ఎండి సర్దార్ అలీ, కుంభం లక్ష్మమ్మ, మాటూరి సునీత గంజి రాజేష్, బొల్లు రవీంద్ర కుమార్,లకపాక రాజు బాణాల పరిపూర్ణ చారి, బొడ్డుపల్లి సైదులు, వేముల వెంకన్న, కారంపూడి రాము, మాటూరి నరేందర్, సునీత, ముత్తయ్య, కాశయ్య సంతోష తదితరులు పాల్గొన్నారు .

CHIRRABOINA RAMA RAO YADAV
CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully