4వ వార్డులో తాగునీటి సమస్య

అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం


నంద్యాల, మే 20 )డిగ్నిటి న్యూస్): నంద్యాల పట్టణంలోని 4వ వార్డులో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం అధికారులకు ఫోన్ చేసి సమస్యను తెలియజేయగా, సాయంత్రం 7 గంటలకు నీళ్లు వస్తాయని సమాచారం ఇచ్చారని తెలిపారు. అయితే రాత్రి వరకు కూడా నీటి సరఫరా ప్రారంభం కాలేదని వాపోయారు. ఈ విషయమై సంబంధిత సిబ్బంది శ్రీను అనే వ్యక్తికి పలుమార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని స్థానికులు ఆరోపించారు. తాగునీరు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని, పైప్‌లైన్ సమస్యను వెంటనే పరిష్కరించి నీటి సరఫరా పునరుద్ధరించాలని కమిషనర్‌ను మీడియా ద్వారా కోరారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వార్డు ప్రజలు విజ్ఞప్తి చేశారు.

Translate »