కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుకలు

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 23 (డిగ్నిటి న్యూస్): రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుకలు శనివారం స్థానిక మారుతి సుజుకి పవన్ మోటార్స్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పవన్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోమటిరెడ్డి చంద్ర పవన్ రెడ్డి, సీసీఓ రవిరెడ్డి, జీఎం నాగమణి సుధాకర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా చంద్ర పవన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేక రహదారుల నిర్మాణాలను చేపడుతున్నారని కొనియాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న వెంకటరెడ్డి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. అనంతరం సంస్థ ఉద్యోగులు మంత్రికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »