RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

గానుగ కేంద్రాలలో నాణ్యమైన ముడి పదార్థం ఉపయోగించాలి

ప్రాంగణాన్ని పరిశుభ్రంగా శుభ్రతతో నిర్వహించాలి

ముడి పదార్థాలను సురక్షితంగా నిల్వ చేయాలి

ప్రజలు లూజ్ ఆయిల్ కొనుగోలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలి

నల్లగొండ ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్ రెడ్డి

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . మే 8 .(డిగ్నిటీ న్యూస్): నల్గొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శివ శంకర్ రెడ్డి దేవరకొండ బస్టాండ్ ప్రాంగణంలోని శివ గంగా ట్రేడర్స్, తిరునాల రోటరీ ఆయిల్ మిల్ , నందిని సంస్థలను తనిఖీ చేశారు.తనిఖీల సందర్భంగా చెల్లుబాటు అయ్యే ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు, అలాగే 15 లీటర్ల టిన్ల నుంచి గానుగ యంత్రం ద్వారా లూజ్ ఆయిల్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

చర్యల్లో భాగంగా మూడు అనుమానిత ఆయిల్ నమూనాలను విశ్లేషణ కోసం సేకరించారు. అదనంగా, మంచి నాణ్యత కలిగిన వేరుశెనగలను మాత్రమే వినియోగించాలని, గానుగ కేంద్రాలలో నాణ్యమైన ముడి పదార్థాలను ఉపయోగించాలని, ప్రాంగణాన్ని పరిశుభ్రంగా , శుభ్రతతో నిర్వహించాలని, ముడి పదార్థాలను సురక్షితంగా నిల్వ చేయాలని, అలాగే ప్రజలు లూజ్ ఆయిల్స్ కొనుగోలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని వ్యాపార నిర్వాహకులు , వినియోగదారులను హెచ్చరించారు.

ప్రజారోగ్య పరిరక్షణ కోసం అన్ని ఫుడ్ బిజినెస్ నిర్వాహకులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే లైసెన్స్ పొందుతూ, ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని ఫుడ్ సేఫ్టీ శాఖ సూచించింది.

Chintha Yadaiah
Chintha Yadaiah
Reporter
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully