నంద్యాల, మే 20 (డిగ్నిటి న్యూస్): యంగ్ టైగర్ ఎన్టీఆర్ 43వ జన్మదిన వేడుకలు స్థానిక రామనాథ్ థియేటర్లో అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి. నంద్యాల ఎన్టీఆర్ ఫాన్స్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ వలి ఆధ్వర్యంలో థియేటర్ యజమాని పుల్లారెడ్డి చేతుల మీదుగా భారీ కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఉదయం ‘ఊసరవెల్లి’ ప్రత్యేక షోతో పాటు, ‘డ్రాగన్’ చిత్ర గ్లింప్స్‌ను ప్రదర్శించారు. ఈ వేడుకల్లో భాగంగా అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కోణిదెడు ప్రభుత్వ పాఠశాల సైన్స్ ల్యాబ్ ఫర్నిచర్ కోసం 20 వేల రూపాయల ఆర్థిక సాయం అందించడంతో పాటు, ఇబ్బందుల్లో ఉన్న ఒక అభిమాని కుటుంబానికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అభిమానుల సేవా నిరతిని థియేటర్ అధినేత పుల్లారెడ్డి అభినందించగా, ప్రతి ఏటా ఇలాంటి సామాజిక కార్యక్రమాలు కొనసాగిస్తామని మహబూబ్ వలి తెలిపారు. ఈ కార్యక్రమంలో అభిమానులు బాలు, శేఖర్, మహబూబ్బషా, శంకర్‌రెడ్డి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు
