నల్లగొండ డి.ఎస్.పి.కె శివరాం రెడ్డి ఆధ్వర్యంలో 7మంది సీఐలు, 10 మంది ఎస్ఐలు,నార్కోటిక్ దాల్ తో కలిసి సుమారు 2500 మంది పోలీసు అధికారులు సిబ్బంది పట్టణంలో సుమారు 360 ఇండ్లలో తనిఖీలు, 46 మంది అనుమానితులను గుర్తింపు నేర నియంత్రణ లక్ష్యంగా నల్లగొండ పట్టణంలో తెల్లవారుజామున10 బృందాలతో విస్తృత కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .మే 26 .(డిగ్నిటీ న్యూస్) నల్లగొండ జిల్లా…
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి
డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బైక్‌లను నెట్టుకుంటూ నిరసన నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 26 .(డిగ్నిటీ న్యూస్).పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండలోని సుభాష్ విగ్రహం నుండి క్లాక్ టవర్ వరకు బైక్‌లను నెట్టుకుంటూ వెళ్లి వినూత్నంగా నిరసన తెలిపారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. ఒకవైపు ప్రజల ఆదాయం…
రైలు ఢీకొని పెద్దపులి మృతి
నంద్యాల, మే 25 (డిగ్నిటి న్యూస్): గాజులపల్లి–చలమ రైల్వే స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు ఢీకొని ఆడ పెద్దపులి మృతి చెందింది. శనివారం రాత్రి చైనేజ్ 234/2-3 కి.మీ వద్ద ఘటన చోటుచేసుకోగా సమాచారం అందుకున్న అటవీ అధికారులు అక్కడికి చేరుకుని తనిఖీ నిర్వహించారు. మృతి చెందిన పులి సుమారు ఐదేళ్ల వయస్సు గల ఆడ పులిగా గుర్తించారు. ఆదివారం నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు అధికారులు, వైద్య బృందం ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు. ఘటనపై…
శ్రీశైలంలో ఈరోజు భక్తుల రద్దీ దృశ్యాలు
నంద్యాల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం: పలుచోట్ల విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, సంజామల మండలంలో రైస్ మిల్లు గోడకూలి 20 గొర్రెలు మృతి
బనగానపల్లె, మే 24 (డిగ్నిటి న్యూస్): నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో రాత్రి వేళ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తీవ్రమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వీచిన బలమైన గాలుల ధాటికి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులపై భారీ వృక్షాలు కూలిపోవడంతో రాత్రి నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు…
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే బక్రీద్ వేడుకలు
నంద్యాల జిల్లా ఇమ్మాముల సంఘం, జమియేతే ఉలేమా హిందూ కీలక నిర్ణయం నంద్యాల, మే 24 (డిగ్నిటి న్యూస్): రాబోయే పవిత్ర బక్రీద్ పండుగను ప్రభుత్వ నిబంధనలకు లోబడి, అత్యంత ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నంద్యాల జిల్లా ఇమ్మాముల సంఘం, జమియేతే ఉలేమా హిందూ పిలుపునిచ్చాయి. స్థానిక కుబ్రా మసీదులో అంజాద్ బాషా సిదికి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ముస్లిం మత పెద్దల ముఖ్య సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశారు. పండుగ రోజున నిర్ణీత సమయానికి…
కోదాడ హైవేపై ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు!
కోదాడ, మే 24 (డిగ్నిటి న్యూస్): సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని జాతీయ రహదారి–65 పై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని జాతీయ రహదారి–65 పై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్న యోలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసమై, ప్రయాణికుల్లో…
ఎస్పీ క్యాంప్ కార్యాలయం ఎదుట తప్పిన ముప్పు: అదుపుతప్పి బోల్తా పడిన వాటర్ ట్యాంకర్
నల్గొండ , మే 24 (డిగ్నిటి న్యూస్): జిల్లా కేంద్రంలో ఆదివారం ఓ వాటర్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. స్థానిక జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) క్యాంప్ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ట్యాంకర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ మార్గంలో ఇతర వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఒక పెద్ద ప్రమాదం తృటిలో…
శ్రీశైలం సున్నిపెంటలో మళ్లీ చిరుత కలకలం!
నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట జెన్కో కాలనీలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో చిరుత పులి మరోసారి సంచరించింది. ఓ కోడిని ఎత్తుకెళ్లేందుకు చిరుత ప్రయత్నించిన దృశ్యాలను స్థానికులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. గతంలోనూ ఇక్కడ చిరుత సంచరించి కుక్కను ఎత్తుకెళ్లడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఎవరూ బయటకు రావద్దని, అత్యవసరమైతే జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.
ఎస్.కొత్తూరు ఆలయానికి 70 వేల విరాళం
పాణ్యం, మే 23 (డిగ్నిటి న్యూస్): మండలంలోని ప్రముఖ శైవక్షేత్రమైన ఎస్.కొత్తూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి శనివారం 70 వేల విరాళం అందినట్లు ఆలయ ఈవో యం.రామక్రిష్ణ తెలిపారు. ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన చిన్న జగదీష్, గీత దంపతులు తమ ఇలవేల్పు అయిన స్వామివారికి మొక్కుబడి కింద ఈ విరాళాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా దాతల కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో స్వామివారి అభిషేకం, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం…










