RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

శ్రీశైలం సున్నిపెంటలో మళ్లీ చిరుత కలకలం!

నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట జెన్కో కాలనీలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో చిరుత పులి మరోసారి సంచరించింది. ఓ కోడిని ఎత్తుకెళ్లేందుకు చిరుత ప్రయత్నించిన దృశ్యాలను స్థానికులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. గతంలోనూ ఇక్కడ చిరుత సంచరించి కుక్కను ఎత్తుకెళ్లడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఎవరూ బయటకు రావద్దని, అత్యవసరమైతే జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.

CHIRRABOINA RAMA RAO YADAV
CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully