కోదాడ హైవేపై ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు!

కోదాడ, మే 24 (డిగ్నిటి న్యూస్): సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని జాతీయ రహదారి–65 పై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని జాతీయ రహదారి–65 పై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్న యోలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసమై, ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు నొప్పులతో విలవిల్లాడుతుండగా, మిగిలిన ప్రయాణికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఘటన స్థలంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు.

నిద్ర మత్తులో….

తెల్లవారుజామున వేళల్లో డ్రైవర్ అలసటకు గురై నియంత్రణ కోల్పోవడంతో బస్సు లారీని ఢీకొట్టిందని వారు తెలిపారు. సమాచారం అందుకున్న కోదాడ టౌన్ సీఐ శివ శంకర్ నాయక్ తన సిబ్బందితో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని 108 అంబులెన్స్ ద్వారా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా, పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను రహదారి పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »