మంత్రికి బోకే అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 23. (డిగ్నిటి న్యూస్)
రాష్ట్ర రోడ్డు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హైదరాబాదులోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి గారిని కలిసి బోకే అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ,డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్ , మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ,పలువురు కార్పొరేటర్లు,మాజీ కౌన్సిలర్లు , ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు మంత్రిని కలిసి బొకే అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

