RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

ముందస్తు అడ్మిషన్లపై చర్యలు తీసుకోవాలి: ఎస్ఎఫ్ఐ

ఆళ్లగడ్డ, మే 7 (డిగ్నిటి న్యూస్): పట్టణంలోని కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల నిబంధనల ఉల్లంఘనపై విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి లతీఫ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారికంగా వేసవి సెలవులు ప్రకటించినప్పటికీ, కొన్ని యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయని మండిపడ్డారు. సెలవుల్లో విశ్రాంతి తీసుకోవాల్సిన ఉపాధ్యాయులపై అడ్మిషన్ల పేరుతో ఒత్తిడి తీసుకురావడం దుర్మార్గమన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రైవేటు పాఠశాలల్లో…

కోటనెమలిపురిలో ‘ఆరోగ్య దర్శని’ ప్రారంభం

రాజుపాలెం, మే 07 (డిగ్నిటి న్యూస్): పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోటనెమలిపురిలో ‘స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శని – న్యూట్రి గార్డెన్’ కార్యక్రమాన్ని అధికారులు, గ్రామ పెద్దలు ప్రారంభించారు. ప్రతి ఇంట్లో కిచెన్ గార్డెన్‌ ఏర్పాటు చేసుకుని పౌష్టికాహారం తీసుకోవాలని, పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని అధికారులు సూచించారు. మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ చిరుధాన్యాలు సేవించాలని, యోగాను జీవనశైలిలో భాగం చేసుకోవాలని వైద్యాధికారి డాక్టర్‌ శ్రీనివాస్‌ కోరారు….

పండ్ల నిల్వ కేంద్రాల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు

నంద్యాల, మే 7 (డిగ్నిటి న్యూస్): నంద్యాల పండ్ల మార్కెట్లలో గురువారం జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఓ. వెంకటరాముడు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా మామిడి పండ్ల సీజన్ కావడంతో, పండ్లను మగ్గబెట్టేందుకు వ్యాపారులు అనుసరిస్తున్న పద్ధతులపై ఆయన ఆరా తీశారు. హానికరమైన కాల్షియం కార్బైడ్‌ను వినియోగించకూడదని, దానివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని వ్యాపారులను హెచ్చరించారు. పండ్లను సహజ పద్ధతుల్లో లేదా ప్రభుత్వం అనుమతించిన ఎథిలీన్ శాచెట్లను మాత్రమే వినియోగించి మగ్గబెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ…

కోదాడలో ఘోరం: భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

కోదాడ, మే 7 (డిగ్నిటి న్యూస్): సూర్యాపేట జిల్లా కోదాడలో బుధవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశాడు. స్థానికులు మరియు పోలీసుల కథనం ప్రకారం.. మణిదీప్, శిరీష(24) దంపతుల మధ్య కొంతకాలంగా మనస్పర్థలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో వీరికి కౌన్సెలింగ్ నిర్వహించారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే మణిదీప్…

అక్రమంగా ప్రవేశించి, దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు

బనగానపల్లి మే 6 (డిగ్నిటి న్యూస్):వైద్య చికిత్స లో నిర్లక్ష్యంగా వ్యవహరించి 9 నెలల పాప మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తూ కొంతమంది వ్యక్తులు బనగానపల్లె టౌన్ లో సురేఖ ఆసుపత్రి లోకి అక్రమంగా ప్రవేశించి, ఫర్నిచర్ ధ్వంసం చేసి అక్కడున్న సిబ్బందిని భయబ్రాంతులకు గురి చేయడం జరిగిందని సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. జరిగిన సంఘటన పై దాడికి పాల్పడిన వ్యక్తులు మరియు వారిని దాడికి ప్రోత్సహించిన కొంతమంది ఎమ్మార్పీఎస్ నాయకులపై ఆసుపత్రి నిర్వాహకుల ఫిర్యాదు మేరకు…

నంద్యాల రైల్వే ప్రయాణికులకు శుభవార్త

నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాల, మే 7 (డిగ్నిటి న్యూస్): గత కొద్ది కాలంగా ఎదురు చూస్తున్న గుంతకల్లు_ మార్కాపురం రైలు ఏర్పాటు ప్రారంభంకు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి గురువారం తెలిపారు.ఈ నెల 12 వ తేదీ మధ్యాహ్నం గుంతకల్లులో రైలు మొదలై…

పాత్రికేయులకు అండగా గోళ్ళ రాజేష్

పాత్రికేయులకు అండగా గోళ్ళ రాజేష్ ​నంద్యాల, మే 6 (డిగ్నిటి న్యూస్): నిత్యం ప్రజా సమస్యలపై కలం పట్టి పోరాడే జర్నలిస్టుల కష్టాలను గుర్తించి వారికి ఆర్థిక భరోసా కల్పించడం అభినందనీయమని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు మధుబాబు, యోగా గురువు ఖండే ఆనంద్ గురూజీ పేర్కొన్నారు. బుధవారం నంద్యాలలో సామాజిక సేవకుడు గోళ్ళ రాజేష్ ఆధ్వర్యంలో ‘చైతన్య జ్యోతి’ పథకం రెండో విడత కింద ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు రూ. 1.84 లక్షల ఆర్థిక సాయాన్ని…

నంద్యాలలో కారు – బైక్ ప్రమాదం: వ్యక్తికి తీవ్ర గాయాలు

నంద్యాల పట్టణంలోని నవమాన్ ఆర్చ్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవ నగర్ కు చెందిన ఓబులేసు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గోడాన్స్ పక్కల సందు నుండి అతివేగంగా దూసుకొచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో, బాధితుడు ఎగిరి పక్కనే ఉన్న కాలువలో పడిపోయారు. చేయి విరిగి తలకు దెబ్బలు తగిలిన బాధితుడిని స్థానికులు చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నివాస ప్రాంతాల్లో వాహనాలను వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం…

జల్సాల కోసం దొంగతనాలు: ముగ్గురు మైనర్ల ముఠా అరెస్టు

మిర్యాలగూడ, మే 5 (డిగ్నిటి న్యూస్): విలాసాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మైనర్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వీరు, పాఠశాల దశలోనే చదువు మానేసి మద్యం, ధూమపానం వంటి దురలవాట్లకు బానిసలయ్యారు. మొదట్లో చిన్న చిన్న వస్తువులు, నాటుకోళ్లు, సైకిళ్లు దొంగిలించి విక్రయించిన వీరు, జల్సాలకు మరింత డబ్బు అవసరం కావడంతో బైక్ చోరీల బాట పట్టారు.మిర్యాలగూడ, హుజూర్‌నగర్ తో పాటు పొరుగు…

ధాన్యం అన్లోడింగ్‌ వేగవంతం చేయాలి: పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర

చిట్యాల, మే 5 (డిగ్నిటి న్యూస్): రబీ ధాన్యం సేకరణలో భాగంగా మిల్లుల వద్ద అన్లోడింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ, ట్రక్కు షీట్లు, హమాలీల లభ్యత, వాహనాల రాకపోకలపై జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పెద్దకాపర్తి కేంద్రానికి…