RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

కంటైనర్ లారి కిందపడి వ్యక్తి మృతి

నల్లగొండ, మే 14 (డిగ్నిటి న్యూస్): నల్లగొండ శివారులోని చర్లపల్లి ఫ్లైఓవర్ బైపాస్ వద్ద గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్‌కు చెందిన కంటైనర్ లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చలకుర్తి గ్రామానికి చెందిన బొల్లం లింగయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. రాజన్నగూడెం నుంచి నల్లగొండ వైపు బైకుపై వస్తుండగా మృత్యువు లారీ రూపంలో కబళించింది. లారీ టైర్ల…

విత్తన దుకాణాల్లో ఏవో తనిఖీలు

విత్తన దుకాణాల్లో ఏవో తనిఖీలు నంద్యాల, మే 13 (డిగ్నిటి న్యూస్): మండలంలోని విత్తన దుకాణాలను బుధవారం మండల వ్యవసాయ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లోని నిల్వ రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలు, అనుమతి పత్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం పది రకాల పత్తి విత్తన నమూనాలను సేకరించి హెచ్‌టీ పరీక్షలు నిర్వహించగా, అవన్నీ నెగిటివ్‌గా తేలాయి. నిబంధనల ప్రకారం అనుమతి ఉన్న విత్తనాలనే విక్రయించాలని, ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు…

ఆకుమల్లలో 15 నుంచి క్రికెట్‌ పోటీలు

కోయిలకుంట్ల, మే 13 (డిగ్నిటి న్యూస్): మండలంలోని ఆకుమల్ల గ్రామ పెద్దమ్మ తల్లి జాతర సందర్భంగా ఈ నెల 15 నుంచి టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వైకాపా నాయకులు గౌరిగారి నాగేశ్వర్‌ రెడ్డి, కాసీం బాషా ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగనున్నాయి. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ. 10,016, ద్వితీయ బహుమతిగా రూ. 5,016 అందజేస్తారు. ఆసక్తి గల జట్లు రూ. 300 ప్రవేశ రుసుము చెల్లించి పేర్లను నమోదు చేసుకోవాలని…

బండలాగుడు పోటీలను ప్రారంభించిన తాటికొండ బుగ్గరాముడు

వెంగళరెడ్డిపేటలో ఘనంగా ఎద్దుల పోటీలు.. క్రీడాకారులకు శుభాకాంక్షలు బండిఆత్మకూరు, మే 13 (డిగ్నిటి న్యూస్): గ్రామీణ క్రీడలు పౌరుషానికి, క్రీడా స్ఫూర్తికి నిదర్శనమని టీడీపీ సీనియర్ నాయకులు, నంద్యాల 38వ వార్డు ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు పేర్కొన్నారు. మండలంలోని వెంగళరెడ్డిపేటలో గణపతి, రాములమ్మ, పోతురాజు విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల సందర్భంగా బుధవారం నిర్వహించిన ఎద్దుల బండలాగుడు పోటీలను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ​ఈ సందర్భంగా బుగ్గరాముడు మాట్లాడుతూ.. పశువులపై మక్కువతో గ్రామీణ సంస్కృతిని కాపాడుతూ…

సంజామలలో అంగరంగ వైభవంగా పెద్దమ్మ దేవర ఉత్సవాలు

ఏళ్ల తరబడి తర్వాత నిర్వహణ.. వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం – బోనాలు, బలిధానాలతో పెద్దమ్మ దేవర ఉత్సవాలు సంజామల, మే 13 (డిగ్నిటి న్యూస్): మండల కేంద్రం సంజామలలో పెద్దమ్మ దేవర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎన్నో సంవత్సరాల విరామం తర్వాత ఈ ఉత్సవాలు జరుగుతుండటంతో పరిసర గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు.ఉత్సవాల్లో భాగంగా భక్తులు సంప్రదాయ బోనాలు సమర్పించగా, బలిధాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు…

అన్నప్రసాద వితరణకు లక్ష రూపాయల విరాళం

శ్రీశైలం, మే 13 (డిగ్నిటి న్యూస్): హైదరాబాద్‌కు చెందిన శ్రీ సత్యగాని నాగుబండి అన్నప్రసాద వితరణ పథకానికి తమ ఉదారతను చాటుకున్నారు. బుధవారంనాడు ఆయన రూ. 1,00,000 (అక్షరాలా లక్ష రూపాయలు) భారీ విరాళాన్ని ఈ పథకం నిమిత్తం అందజేశారు. ఈ విరాళం మొత్తాన్ని పర్యవేక్షకులు కె. అయ్యన్నకు స్వయంగా అందజేయగా, వారు దాతను సాదరంగా ఆహ్వానించారు. విరాళం స్వీకరించిన అనంతరం నిబంధనల ప్రకారం దాతకు తగు రశీదును అందజేశారు. అదేవిధంగా ఆలయ మర్యాదలతో శ్రీ సత్యగాని…

పాఠశాలల బలోపేతానికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి

నల్గొండ, మే 13 (డిగ్నిటి న్యూస్): విద్యా రంగం బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ అవగాహన సదస్సు బుధవారం నల్గొండలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో స్థానిక సంస్థల ప్రతినిధుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. విద్యావంతమైన సమాజమే రాష్ట్ర పురోభివృద్ధికి పునాది అని, పాఠశాలల…

సోషల్‌ మీడియాలో ప్రశ్నించారని బీఆర్‌ఎస్ కార్యకర్తపై దాడి

​కేతేపల్లి: రాజకీయ కక్షలతో నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చీకటిగూడెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోషల్‌ మీడియా వేదికగా కాంగ్రెస్‌ పార్టీ తీరును ప్రశ్నించినందుకు గాను అదే గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త ఆల్దాస్ సతీష్ గౌడ్‌పై కాంగ్రెస్‌ శ్రేణులు మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సతీష్ ప్రస్తుతం సూర్యాపేటలోని ఆర్వీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ​విషయం తెలుసుకున్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆస్పత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. ఈ…

నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి

ఎన్టీఏను రద్దు చేయాలని పీడీఎస్యూ డిమాండ్ హైద్రాబాద్/అమరావతి: దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎం.డి. రఫీ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. దాదాపు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు ఎంతో కష్టపడి ఈ పరీక్షకు సిద్ధమయ్యారని, అయితే…

బ్యాట్ పట్టిన నంద్యాల కలెక్టర్: విద్యార్థులతో కలిసి సందడి

నంద్యాల గుర్సాలపేటలోని కే.ఎన్.ఎం. మున్సిపల్ హైస్కూల్‌ను జిల్లా కలెక్టర్ రాజకుమారి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి పదో తరగతి రెమిడియల్ తరగతులను పరిశీలించారు. అనంతరం పాఠశాల మైదానంలో క్రికెట్ ఆడుతున్న విద్యార్థులతో సరదాగా ముచ్చటించిన ఆమె, స్వయంగా బ్యాట్ పట్టి వారితో కలిసి ఆడి విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఎండలో ఎక్కువసేపు ఆడవద్దని, చదువుపై శ్రద్ధ పెట్టి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు ఆప్యాయంగా సూచించారు. కలెక్టర్ ఇలా విద్యార్థులతో…