కొనుగోలు కేంద్రాలలో రైతులు అమ్మిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి షాపల్లి , నేమ్మని గ్రామాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 13 (డిగ్నిటీ న్యూస్): నార్కట్ పల్లి మండలంలోని షాపల్లి, నెమ్మాని గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అమ్మిన ధాన్యాన్ని వెంటనే…
పేద విద్యార్థుల కోసం ఉచిత ఆంగ్ల విద్య
వీవీఎం పాఠశాల బ్రోచర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వేముల వీరేశం నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 12 (డిగ్నిటి న్యూస్): పేద విద్యార్థుల విద్యాభివృద్ధి లక్ష్యంగా నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం తన మానస పుత్రికగా రూపొందించిన ‘ఉద్దీపన వీవీఎం ఇంగ్లీష్ మీడియం’ పాఠశాల బ్రోచర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికంతో ఏ విద్యార్థీ చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతోనే ఈ పాఠశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు…
సంజామలలో వైభవంగా పెద్దమ్మ దేవర ప్రారంభం
సంజామల, మే 12 (డిగ్నిటి న్యూస్): మండల కేంద్రమైన సంజామలలో మంగళవారం పెద్దమ్మ దేవర మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారి విగ్రహాన్ని మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ శాస్త్రీయ పద్ధతిలో భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు చుట్టుపక్కల మండలాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు…
యాగంటి మలుపు వద్ద ప్రమాదం: వృద్ధురాలి మృతి
బనగానపల్లి, మే 12 (డిగ్నిటి న్యూస్): ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శివానందం ఆశ్రమం వద్ద ఉన్న ప్రమాదకరమైన మలుపులో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఓ వృద్ధురాలు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆటో డ్రైవర్ కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. అదే వాహనంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు మహిళలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…..
బండి భగీరథు ను వెంటనే అరెస్టు చేయాలి
ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ డిమాండ్ నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 12 (డిగ్నిటీ న్యూస్): బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను తక్షణమే అరెస్టు చేయాలని ఐద్వా నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ డిమాండ్ చేశారు .మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని,బాధితురాలికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు….
జనసేన రాచమడుగు సోదరుల ఆధ్యాత్మిక ముందడుగు
భక్తిశ్రద్ధలతో రామకోటి పుస్తకాల పంపిణీ నంద్యాల, మే 12 (డిగ్నిటి న్యూస్): హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శ్రీరామ నామ స్మరణ మహిమను చాటిచెప్పేలా వీసీ కాలనీలోని శ్రీ సీతారామ ఆంజనేయ ఆలయంలో జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్ (రాచమడుగు సోదరులు) ఆధ్వర్యంలో రామకోటి పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. సమాజంలో ధార్మిక చింతన పెరగాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకర్షించింది.రాచమడుగు…
వీరమల్ల వంశీకృష్ణ గౌడ్‌కు డాక్టరేట్
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 11 (డిగ్నిటీ న్యూస్): నల్లగొండ పట్టణం గాంధీనగర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు వీరమల్ల వంశీకృష్ణ గౌడ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి జియాలజీ విభాగంలో డాక్టరేట్ పొందారు. ప్రొఫెసర్ గుండా ప్రభాకర్ పర్యవేక్షణలో నల్లగొండ పరిసరాల్లోని గ్రానైట్ శిలలపై ఆయన చేసిన విశేష పరిశోధనకు గాను వర్సిటీ ఈ గౌరవాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా పిఆర్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్, వంశీకృష్ణ సోదరుడు వీరమల్ల శ్రీనివాస్ గౌడ్…
గోళ్ళ రాజేష్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మొబైల్ కాంటీన్
జిల్లా కలెక్టర్ కార్యాలయం స్పందన కు వచ్చిన ప్రజల హర్షం… ప్రశంసల వెల్లువ.. నంద్యాల, మే 11 (డిగ్నిటి న్యూస్): గోళ్ళ రాజేష్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన రూపాయికి రెండు పుల్కాలు, కర్రీ,పప్పు, భోజనం గడిచిన 8 నెలలుగా కొనసాగుతున్న కార్యక్రమం నంద్యాల నియోజకవర్గంలో ప్రజలందరికి విదితమే అందులో భాగంగా మొబైల్ కాంటీన్ ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం కు వచ్చే జిల్లా ప్రజలు గోళ్ళ రాజేష్ ఏర్పాటు చేసిన మొబైల్ క్యాంటీన్ నందు కేవలం ఒక్క…
మహిళా డిగ్రీ కళాశాలలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ఆవిష్కరణ
నల్గొండ, మే 11 (డిగ్నిటి న్యూస్): నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (అటానమస్)లో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. శ్రీనివాస రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఏడు రోజుల విద్యా ప్రణాళికను (7 Days Education Week Plan), ప్రత్యేక బ్రోచర్ మరియు ఫ్లెక్సీలను అతిథులు ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, వార్డు…
బండి భగీరథను కఠినంగా శిక్షించాలి
బండి సంజయ్ కేంద్రం మంత్రివర్గం నుండి తొలగించాలి: డివైఎఫ్ఐ నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 11 (డిగ్నిటీ న్యూస్): డివైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం నల్గొండ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించారు, ఈ సందర్బంగా డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని, అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కేంద్ర మంత్రివర్గం నుండి…









