యాగంటి మలుపు వద్ద ప్రమాదం: వృద్ధురాలి మృతి

బనగానపల్లి, మే 12 (డిగ్నిటి న్యూస్): ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శివానందం ఆశ్రమం వద్ద ఉన్న ప్రమాదకరమైన మలుపులో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఓ వృద్ధురాలు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆటో డ్రైవర్ కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. అదే వాహనంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు మహిళలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాణికులతో వేగంగా వెళ్తున్న ఆటో మలుపు వద్దకు రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిపారు, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Translate »