జిల్లా కలెక్టర్ కార్యాలయం స్పందన కు వచ్చిన ప్రజల హర్షం… ప్రశంసల వెల్లువ..
నంద్యాల, మే 11 (డిగ్నిటి న్యూస్): గోళ్ళ రాజేష్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన రూపాయికి రెండు పుల్కాలు, కర్రీ,పప్పు, భోజనం గడిచిన 8 నెలలుగా కొనసాగుతున్న కార్యక్రమం నంద్యాల నియోజకవర్గంలో ప్రజలందరికి విదితమే అందులో భాగంగా మొబైల్ కాంటీన్ ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం కు వచ్చే జిల్లా ప్రజలు గోళ్ళ రాజేష్ ఏర్పాటు చేసిన మొబైల్ క్యాంటీన్ నందు కేవలం ఒక్క రూపాయికే ప్లేట్ పుల్కా, కర్రీ,పప్పు ఒక్క రూపాయికే రుచికరమైన భోజనం అతి చౌక ధరకే లభిస్తుండంతో ఎంతోమంది ప్రజల వారి కడుపు నింపుకొని గోళ్ళ రాజేష్ ఏర్పాటు చేసిన ఈ మొబైల్ క్యాంటీన్ అతి తక్కువ ధరకే తమ కడుపునింపిందని గోళ్ళ రాజేష్ ను జిల్లా ప్రజానీకం ఆశీర్వచనాలు అందజేశారు.

ఈ సందర్భంగా గోళ్ళ రాజేష్ కార్యక్రమాల నిర్వాహకులు నూర్ భాషా మాట్లాడుతూ ఈరోజు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంకు నంద్యాల జిల్లా వాసులు ప్రజలు ఎంతో మంది ప్రజానీకం ఈరోజు తమ సమస్యలపై అర్జీలను జిల్లా కలెక్టర్ కలేక్టర్, అధికారులకు ఇచ్చేందుకు కార్యాలయంకు వస్తుంటారని వారి అందరికీ మధ్యాహ్నం సమయంలో భోజనం ఇబ్బంది లేకుండా అతి తక్కువ ధరకే గోళ్ళ రాజేష్ ఏర్పాటుచేసిన మొబైల్ క్యాంటీన్ ద్వారా తక్కువ ధరకే రుచికరమైన ఆహారాన్ని అందించడం ప్రజలకు సాయం చేసే విధంగా ఉంటుందని ఉద్దేశంతో సోమవారం రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గోళ్ళ రాజేష్ ఏర్పాటు చేసిన మొబైల్ కాంటీన్ ఏర్పాటు చేసాము.

ఈ సందర్భంగా ఈ కార్యాలయంకు వచ్చిన ప్రజానీకం తిన్న తరువాత చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని గోళ్ళ రాజేష్ చేస్తున్న ఈ కార్యక్రమాల కు గోళ్ళ రాజేష్ అభినందనలు తెలియజేశారు.వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా గోళ్ళ రాజేష్ ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని నూర్ బాషా భగవంతుని ప్రార్థించారు.

