కంటైనర్ లారి కిందపడి వ్యక్తి మృతి

నల్లగొండ, మే 14 (డిగ్నిటి న్యూస్): నల్లగొండ శివారులోని చర్లపల్లి ఫ్లైఓవర్ బైపాస్ వద్ద గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్‌కు చెందిన కంటైనర్ లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చలకుర్తి గ్రామానికి చెందిన బొల్లం లింగయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. రాజన్నగూడెం నుంచి నల్లగొండ వైపు బైకుపై వస్తుండగా మృత్యువు లారీ రూపంలో కబళించింది. లారీ టైర్ల కింద పడిపోవడంతో ప్రమాద తీవ్రతకు మృతదేహం ఛిద్రమైంది.

​ఆర్టీవో అధికారుల వాహన తనిఖీల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో లారీ డ్రైవర్ వాహనాన్ని అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న నల్లగొండ రూరల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Translate »