RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

బెలుం సింగవరంలో గాలివాన బీభత్సం

విరిగిపడిన చెట్లు, కూలిన విద్యుత్ స్తంభాలు కొలిమిగుండ్ల, మే 22 (డిగ్నిటి న్యూస్): నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బేలుం సింగవరం గ్రామంలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ గాలివాన ధాటికి గ్రామంలో పలుచోట్ల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ స్తంభాలు నేలకూలడంతో పాటు భారీ వృక్షాలు విరిగి రోడ్డుపై పడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది, గ్రామస్థులు కలిసి రోడ్డుపై పడిన చెట్లను…

వేసవిలో శరీర వేడి, దాహం, అలసట తగ్గించడానికి డాక్టర్ ఆర్ శ్రీనివాస్ ప్రభుత్వ ఆయుష్ వైద్య అధికారి సూచనలు

1.. నిమ్మరసం: రోజుకు రెండు సార్లు (ఉదయం & మధ్యాహ్నం) తాగితేదాహం తగ్గుతుంది శరీరం చల్లగా ఉంటుందిఆరోగ్యానికి మంచిది. 2. చింతపండు రసం: ప్రతి రోజు ఒక గ్లాస్ చింతపండు రసం నాలుగు మిరియాల పొడి కొంచెం బెల్లం కలిపి తాగితే సన్ స్ట్రోక్ నుంచి రక్షణ కలుగుతుంది, శరీరం చల్లబడుతుంది. 3. కొబ్బరి నీళ్లు: రోజుకు ఒకసారి తాగితే శక్తి ఇస్తుంది శరీర వేడి తగ్గిస్తుంది. 4. పెసరపప్పు జావ: ఉడికించిన పెసరపప్పు జావ తాగితే…

జొన్న రైతులకు వైకాపా యువజన విభాగం అన్నదానం

నంద్యాల, మే 21 (డిగ్నిటి న్యూస్): గత మూడు రోజులుగా స్థానిక గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్న జొన్న రైతులకు వైకాపా నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు వైకాపా జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో గురువారం భోజన వసతి కల్పించారు. నిరుపేద రైతులు తిండి తిప్పలు మానేసి గోదాముల వద్దే బండ్లు నిలుపుకొని ఇబ్బందులు పడుతుండటాన్ని గమనించిన కాటసాని రాంభూపాల్ రెడ్డి, వారిని తక్షణమే ఆదుకోవాలని యువజన విభాగాన్ని పురమాయించారు.దీనిపై స్పందించిన…

ఉపాధి హామీని కొనసాగించాలి

వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 20 (డిగ్నిటి న్యూస్): ‘వి బి జి రాంజీ’ పథకాన్ని రద్దు చేసి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నల్గొండ కలెక్టరేట్ ముందు నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న ఉపాధి హామీని నిర్వీర్యం చేసేందుకు…

ఘనంగా ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

నంద్యాల, మే 20 (డిగ్నిటి న్యూస్): యంగ్ టైగర్ ఎన్టీఆర్ 43వ జన్మదిన వేడుకలు స్థానిక రామనాథ్ థియేటర్‌లో అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి. నంద్యాల ఎన్టీఆర్ ఫాన్స్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ వలి ఆధ్వర్యంలో థియేటర్ యజమాని పుల్లారెడ్డి చేతుల మీదుగా భారీ కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఉదయం ‘ఊసరవెల్లి’ ప్రత్యేక షోతో పాటు, ‘డ్రాగన్’ చిత్ర గ్లింప్స్‌ను ప్రదర్శించారు. ఈ వేడుకల్లో భాగంగా అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కోణిదెడు…

జలదుర్గం జెడ్పీహెచ్‌ఎస్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

జలదుర్గం, మే 20 (డిగ్నిటి న్యూస్): నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని జలదుర్గం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006-07 విద్యాసంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తమకు నాణ్యమైన విద్య అందించిన ఉపాధ్యాయుల వల్లే ఉన్నత స్థాయిలో ఉన్నామని తెలిపారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, తమ పిల్లలకు మంచి విద్య అందించాలని సూచించారు. అనంతరం…

4వ వార్డులో తాగునీటి సమస్య

అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం నంద్యాల, మే 20 )డిగ్నిటి న్యూస్): నంద్యాల పట్టణంలోని 4వ వార్డులో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం అధికారులకు ఫోన్ చేసి సమస్యను తెలియజేయగా, సాయంత్రం 7 గంటలకు నీళ్లు వస్తాయని సమాచారం ఇచ్చారని తెలిపారు. అయితే రాత్రి వరకు కూడా నీటి సరఫరా ప్రారంభం కాలేదని వాపోయారు. ఈ విషయమై సంబంధిత సిబ్బంది శ్రీను అనే వ్యక్తికి పలుమార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్…

విత్తన దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

నంద్యాల, మే 20 (డిగ్నిటి న్యూస్): నంద్యాల మండలంలో విత్తన దుకాణాలను మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లు, బిల్‌బుక్స్‌, అనుమతి పత్రాలు పరిశీలించారు. వివిధ కంపెనీలకు చెందిన 10 రకాల ప్రత్తి విత్తనాల నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. అనంతరం నిర్వహించిన హెచ్‌టీ పరీక్షల్లో విత్తనాలు హెచ్‌టీ నెగిటివ్‌గా తేలినట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలనే రైతులకు విక్రయించాలని, ఎంఆర్‌పీ కంటే…

మహిళల భద్రతకు శక్తి యాప్ వినియోగించాలి: ఎస్పీ సునీల్ షొరాణ్

నంద్యాల, మే 20 (డిగ్నిటి న్యూస్): మహిళల రక్షణ కోసం ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ పేర్కొన్నారు. పాణ్యం మండలంలోని RGM ఇంజనీరింగ్ కళాశాలలో “మహిళల సంరక్షణ మా బాధ్యత” అంశంపై గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.విద్యార్థినులు తమ లక్ష్యాలను ముందుగానే నిర్దేశించుకొని కష్టపడి చదివితే విజయాలు సాధించవచ్చని ఎస్పీ సూచించారు. ఆపద సమయంలో వెంటనే పోలీస్ సహాయం పొందేందుకు ప్రతి…

మంత్రి కోమటిరెడ్డిని కలిసిన గద్వాల విజయలక్ష్మి

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 20 (డిగ్నిటీ న్యూస్):రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఇటీవల నియమితులైన గద్వాల విజయలక్ష్మి బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం జరిగే మహిళా కమిషన్ చైర్‌పర్సన్, సభ్యుల బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతన చైర్‌పర్సన్‌, సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.