వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శీలం శ్రీనివాసులు నంద్యాల, జూన్ 8 (డిగ్నిటి న్యూస్): అర్హులైన వికలాంగులందరికీ ఎన్టీఆర్ భరోసా పథకం కింద నెలకు రూ.15 వేల పింఛన్ను తక్షణమే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శీలం శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సోమవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ లో కలెక్టర్ రాజకుమారి గనియాను కలిసి…
మృగశిర కార్తి లో ఆరోగ్యం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ ఆర్ శ్రీనివాస్ సూచనలు
మృగశిర కార్తె ప్రారంభంతో వేసవి తీవ్రత తగ్గి, వాతావరణం చల్లబడి, తొలకరి జల్లులు మొదలవుతాయి. ఈ రుతుపవనాల మార్పు సమయంలో బ్యాక్టీరియా, వైరస్లు సులభంగా వ్యాప్తి చెందుతాయి. ఈ కాలంలో సంక్రమణ వ్యాధుల (Infections) నుంచి రక్షణ పొందడానికి మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి అని డాక్టర్ ఆర్ శ్రీనివాస్ ప్రభుత్వ ఆయుర్వేద. వైద్యాధికారి వైద్యాధికారి ఆరోగ్య సూచనల మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆహారపు అలవాట్లు మాంసాహారులు: (నాన్ వెజిటేరియన్) చేపలను తినడం:…
గంగయ్య నాయుడికి రాజ్యసభ సీటు కేటాయించాలి
రాయల్ పీపుల్స్ ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు అశ్వత్తామ రాయల్ డిమాండ్ పలమనేరు, జూన్ 7 (డిగ్నిటి న్యూస్): ప్రముఖ హైకోర్టు న్యాయవాది, సామాజిక సేవకుడు గంగయ్య నాయుడికి రాజ్యసభ సభ్యత్వం కేటాయించాలని రాయల్ పీపుల్స్ ఫ్రంట్ (ఆర్పీఎఫ్) జిల్లా అధ్యక్షుడు గాంగేయుల అశ్వత్తామ రాయల్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బలిజ, కాపు సామాజికవర్గాలు ఎంతో కృషి చేశాయని పేర్కొన్నారు. అయితే, పదవుల కేటాయింపులో ఆయా వర్గాల ప్రముఖులకు…
10న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం
కలెక్టరేట్లో ఉద్యోగుల సమస్యలపై చర్చ.. ఏపీజీఈఏ ప్రతినిధుల వెల్లడి నంద్యాల, జూన్ 7 (డిగ్నిటి న్యూస్): జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారార్థం ఈ నెల 10వ తేదీ సాయంత్రం 4:00 గంటలకు నంద్యాల కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) హాల్లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప, కార్యదర్శి శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించబోయే ఈ సమావేశంలో…
దేవరకొండలో వృద్ధుడి అనుమానాస్పద మృతి
ఇంట్లో కుళ్లిన స్థితిలో మృతదేహం.. కలకలం రేపిన ఘటన దేవరకొండ, జూన్ 7 (డిగ్నిటి న్యూస్): స్థానిక గాంధీనగర్లో ఒంటరిగా నివసిస్తున్న నాయిని రాజీ రెడ్డి (80) అనే వృద్ధుడు తన నివాసంలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ప్రముఖ వ్యక్తి నాయిని ప్రతాప్ రెడ్డి కుమారుడైన రాజీ రెడ్డి సోదరులంతా అమెరికాలో స్థిరపడటంతో ఆయన ఇక్కడే ఒంటరిగా ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఎవరికీ ఫోన్లు ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు ఆదివారం ఇంటికి…
ఆకుమల్లలో వైభవంగా పెద్దమ్మ దేవర
అమ్మవారిని దర్శించుకున్న మంత్రి బి.సి.జనార్ధనరెడ్డి సతీమణి ఇందిరమ్మ.. పోటెత్తిన భక్తులు సంజామల, జూన్ 7 (డిగ్నిటి న్యూస్): మండల పరిధిలోని ఆకుమల్ల గ్రామంలో పెద్దమ్మదేవర ఉత్సవాలు భక్తుల కోలాహలం మధ్య అత్యంత ఘనంగా జరిగాయి. శనివారం రాత్రి అమ్మవారి విగ్రహాన్ని భక్తుల జయజయధ్వానాల నడుమ గ్రామోత్సవం నిర్వహించి, అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై కొలువుదీర్చారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి, అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అలంకరణలు చేపట్టారు. ఆదివారం ఉదయం గ్రామంలోని మహిళలు భక్తిశ్రద్ధలతో…
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు
అభిషేకాలు, సర్పసూక్త హోమాలతో కిక్కిరిసిన సేవా క్షేత్రం.. భక్తుల భారీ సందడి S. కొత్తూరు/పాణ్యం, జూన్ 7 (డిగ్నిటి న్యూస్): మండల కేంద్రమైన పాణ్యంలోని సేవా క్షేత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయ ప్రధాన అర్చకులు తెలిపిన వివరాల ప్రకారం, ఈరోజు స్వామివారికి ఎంతో భక్తిశ్రద్ధలతో విశేష అభిషేకాలు, సర్పసూక్తం, మహానివేదన, మరియు మహా మంగళహారతి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారి దర్శనార్థం వివిధ…
ఏసీబీ వల్లలో చిక్కిన వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమ్మద్
వైభవంగా చౌడేశ్వరి అమ్మవారి జ్యోతుల ఉత్సవం
భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు ఆకుమల్ల పెద్దమ్మ జాతరలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ సంజామల, జూన్ 6 (డిగ్నిటి న్యూస్): మండలంలోని ఆకుమల్ల గ్రామంలో జరుగుతున్న పెద్దమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి చౌడేశ్వరి అమ్మవారి జ్యోతుల కార్యక్రమాన్ని భక్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని తళారీ జక్కులు నివాసం వద్ద నుంచి ప్రారంభమైన ఈ జ్యోతుల ప్రదర్శన మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా సాగింది. ప్రధాన వీధుల…
రైతులందరికీ విశిష్ట సేవా సంఖ్య తప్పనిసరి
ఖరీఫ్ సన్నాహకాలపై వ్యవసాయ సిబ్బంది, డీలర్ల సమావేశం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు నంద్యాల, జూన్ 6 (డిగ్నిటి న్యూస్): నంద్యాల సబ్ డివిజన్ పరిధిలోని వ్యవసాయ సిబ్బంది, ఇన్పుట్ డీలర్లకు ఖరీఫ్ సన్నాహకాలపై శనివారం జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా రైతులు పంటలు, రకాలు ఎంపిక చేసుకునేలా గ్రామాల్లో…









