DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
10న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం
News

10న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం

07 Jun 2026, 01:20 PM   |   Dignity News

కలెక్టరేట్‌లో ఉద్యోగుల సమస్యలపై చర్చ.. ఏపీజీఈఏ ప్రతినిధుల వెల్లడి

నంద్యాల, జూన్ 7 (డిగ్నిటి న్యూస్): జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారార్థం ఈ నెల 10వ తేదీ సాయంత్రం 4:00 గంటలకు నంద్యాల కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) హాల్‌లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప, కార్యదర్శి శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించబోయే ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగుల సమస్యలు, సంక్షేమ అంశాలు మరియు పరిపాలనా సంబంధిత విషయాలపై సుదీర్ఘంగా చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషించనున్నట్లు వారు పేర్కొన్నారు.ఈ క్రమంలోనే నంద్యాల జిల్లాలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను, వారి వినతులను తమ సంఘం పక్షాన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని వారు వివరించారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.