RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

నగరాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి

మున్సిపల్ కమిషనర్ బి. శరత్ చంద్ర నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, జూన్ 6 (డిగ్నిటి న్యూస్): నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో శనివారం ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ రెండో విడత వార్డు సభలు విజయవంతంగా జరిగాయి. డివిజన్ నెంబర్ 15, 16లలో నిర్వహించిన సభలకు మున్సిపల్ కమిషనర్ బి. శరత్ చంద్ర స్వయంగా హాజరై ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన వ్యర్థాల నిర్వహణ…

చెర్లగౌరారంలో ఘనంగా ‘బాల పంచాయతీ’

నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, జూన్ 6 (డిగ్నిటి న్యూస్): నల్లగొండ జిల్లా కనగల్ మండలం చెర్లగౌరారం గ్రామంలో జిల్లా పోలీస్ శాఖ, యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బాల పంచాయతీ’ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, సమస్యల పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి టీజీపీఏ డైరెక్టర్ అభిలాషా బిష్త్, కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్య అతిథులుగా…

ఘాట్ రోడ్డు పేరిట గుప్త నిధుల తవ్వకాలు జరుపుతున్నారా..?

– మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, జూన్ 6 (డిగ్నిటి న్యూస్): నల్లగొండ పట్టణంలోని బ్రహ్మంగారి గుట్ట, లతీఫ్ సాబ్ గుట్టలపై ఘాట్ రోడ్డు నిర్మాణం కోసం నిన్న సాయంత్రం ముందస్తు సమాచారం లేకుండా జరిపిన భారీ పేలుళ్లపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాస్టింగ్‌ల కారణంగా మునుగోడు రోడ్ హౌసింగ్ కాలనీలోని ఇళ్లపై పెద్ద పెద్ద బండరాళ్లు పడి స్లాబ్‌లు, రేకులు…

నల్లగొండ కలెక్టరేట్ వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో ఏసీబీ రైడ్…!?

నల్లగొండ బ్రేకింగ్: ఎన్నో సంవత్సరాలుగా తప్పించుకొని తిరుగుతున్న తిమింగళం వలలో పడినట్టు సమాచారం… కార్యాలయంలో కొనసాగుతున్న తనిఖీలు… నిన్న హైదరాబాద్ వక్ఫ్ బోర్డ్ అధికారులు ఘాటు రోడ్డు సర్వే వచ్చినట్టు సమాచారం… వచ్చిన అధికారులకు బెదిరించే ప్రయత్నాలు కూడా జరిగినట్టు ప్రచారం… ఈ విషయంపై వక్ఫ్ బోర్డు సీఈవో సీరియస్ తీసుకున్నట్టు సమాచారం… ఒకేసారి నల్లగొండ వక్ఫ్ బోర్డు కార్యాలయం పై ఆకస్మిక దాడి చేసిన ఏసీబీ అధికారులు… వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..

ప్రమాదమా..? నిర్లక్ష్య డ్రైవింగా..?

సూర్యాపేటలో యువకుడి జీవితాన్ని ఛిద్రమం చేసిన రోడ్డు ప్రమాదం సూర్యాపేట, జూన్ 6 (డిగ్నిటి న్యూస్): సూర్యాపేట పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గాంధీనగర్ ప్రాంతంలోని జనగామ – సూర్యాపేట ప్రధాన రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం, అర్వపల్లి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఎస్.కె. అక్బర్ పాషా అనే…

”ఒకటో తేదీ జీతాలు” హామీ ఏమైంది..?

సర్పంచులు, అంగన్వాడీల్లో ఆందోళన హైదరాబాద్, జూన్ 5 (డిగ్నిటి న్యూస్): ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులందరికీ జీతాలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిన హామీ అమలుపై ఇప్పుడు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గ్రామ పంచాయతీ సర్పంచులు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వం ఇచ్చిన “ఒకటో తేదీకే జీతాలు” హామీ కేవలం ప్రకటనలకే పరిమితమైందా అనే చర్చ ఉద్యోగ వర్గాల్లో మొదలైంది.రాష్ట్రంలోని 12,762 గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచులు…

రైతుకు తీవ్ర గాయాలు

వరికోయల వ్యర్థాల దహనం చేస్తుండగా ప్రమాదం నకిరేకల్, జూన్ 3 (డిగ్నిటి న్యూస్): వ్యవసాయ పొలంలో వరికోత వ్యర్థాలను తగులబెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు ఓ రైతు నిప్పుల చిక్కుకుని తీవ్రంగా గాయపడిన ఘటన నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గొల్లగూడెం గ్రామపంచాయతీ పరిధికి చెందిన చిర్రబోయిన మీసాల లింగయ్య అనే రైతు బుధవారం తన వ్యవసాయ క్షేత్రంలో వరి కోయిల (పంట వ్యర్థాల)ను తొలగించేందుకు నిప్పు పెట్టారు.ఈ క్రమంలో…

మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

గొల్లగూడెంలో వైభవంగా యాదవుల ఆరాధ్య దైవం మల్లన్న జాతర నకిరేకల్, జూన్ 1 (డిగ్నిటి న్యూస్):: నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో యాదవుల ఆరాధ్య దైవమైన శ్రీ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా ప్రారంభమైంది. సోమవారం జరిగిన ఈ జాతర ఉత్సవాల్లో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నాయకుడు చిరుమర్తి లింగయ్య పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, యాదవ సంఘం ప్రతినిధులు ఆయనకు ఘన…

“ఓ లింగా.. ఓ లింగా..” అంటూ మారుమోగిన గొల్లగూడెం

డప్పు బేరీలు, బోనాలు, భక్తి నినాదాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న గొల్లగూడెం జాతర శ్రీ మల్లన్న స్వామికి భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ నకిరేకల్, జూలై 1 (డిగ్నిటి న్యూస్): మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి, మేడలమ్మ, కేతమ్మ, ఎల్లమ్మ దేవతల జాతర ఉత్సవాలు సోమవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు సంప్రదాయ పద్ధతిలో బోనాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. జాతర సందర్భంగా మహిళలు అలంకరించిన బోనాలను తలపై మోసుకుంటూ ఆలయానికి…

ప్రతి నెల చివరి శనివారం దివ్యాంగులకు వయోవృద్ధులకు ప్రత్యేక ప్రజావాణి

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి మే 29 (డిగ్నిటీ న్యూస్): ప్రతినెల చివరి శనివారం మే 30 నాడు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు మాత్రమే ప్రత్యేక ప్రజావాణి దివ్యాంగులకు మరియు వయోవృద్ధులకు నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా సంక్షేమ అధికారిని కె.వి కృష్ణ వేణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు . ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమం మహిళా సంక్షేమ వారోత్సవాలలో భాగంగా దివ్యాంగుల కొరకు…