నంద్యాల: నంద్యాలలోని ఎస్‌ఆర్‌బీసీ, అయ్యలూరు మెట్ట ప్రాంతాల్లో నిర్మించిన టిడ్కో గృహాలను టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఆంధ్రప్రదేశ్ వాల్మీకి స్టేట్ బోర్డ్ డైరెక్టర్ తోల్లా మంజునాథ్, జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్‌లతో కలసి గృహాల నిర్మాణ పరిస్థితి, తాగునీరు, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను ఆయన తనిఖీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు…
బాధితులకు అండగా సీఎం సహాయనిధి: ఎమ్మెల్యే గిత్త జయసూర్య
నందికొట్కూర్, అక్టోబర్ 7 (డిగ్నిటి న్యూస్): అనారోగ్యంతో వైద్య చికిత్సలు చేయించుకున్న పేద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) ఎంతో ఉపయోగపడుతోందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పేర్కొన్నారు. పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ గ్రామంలో బుధవారం ఆయన లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కట్టా బ్రహ్మానందరెడ్డికి రూ. 47,896, అప్పిరెడ్డిగారి నరసింహారెడ్డికి రూ. 1,57,000, రేవల్లి సత్యనారాయణకు రూ. 43,565 విలువైన చెక్కులను అందజేసి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి
సంపదకు కొత్త అర్థం,సేవలో కనిపించే మానవత్వం,విజన్ పెద్దది… గమ్యం ఒక్కటే ప్రతి జీవికి& వ్యక్తికి గౌరవం “వ్యాపార వారసత్వంతో పాటు… సేవా వారసత్వం,ఒక ఆలోచన వేలాది ప్రాణాలకు ఆశ _అనంత్ అంబానీ ప్రత్యేక దృక్పథం
పున్న కైలాస్ నేతకు పెద్దల సభ అవకాశం కల్పించాలి: తెలంగాణ ఉద్యమకారులు
నల్గొండ: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు పున్న కైలాస్ నేతను స్థానిక ఉద్యమకారులు సైదులు, ముక్కాముల సైదులు, మిర్యాల సైదులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన ఆయనకు త్వరలోనే పెద్దల సభ (శాసన మండలి)లో అడుగుపెట్టే అవకాశం దక్కాలని ఆకాంక్షించారు. ఉద్యమకారులకు ఎల్లప్పుడూ అండగా ఉండే కైలాస్ నేతకు ఈ సందర్భంగా తమ పూర్తి మద్దతు మరియు భరోసాను తెలియజేశారు.
మంత్రి బీసీని మర్యాదపూర్వకంగా కలిసిన APWJF నాయకులు
బనగానపల్లె: స్థానిక క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు భవనాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (APWJF) నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల ఎన్నికైన జిల్లా నాయకులు మద్దయ్య యాదవ్, నరసింహారెడ్డి, రామచంద్రారెడ్డి, జవహర్, షాషావలిలు మంత్రికి జ్ఞాపికను అందజేసి సన్మానించారు. అనంతరం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ మండల నాయకులు చంద్రశేఖర్, మధు,…
హక్కుల సాధనకు ఈనెల 12న ‘చలో కలెక్టరేట్’: APWJF
నంద్యాల: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, రక్షణ చట్టం, రైల్వే పాసుల పునరుద్ధరణ మరియు సంక్షేమ నిధి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12న ‘చలో కలెక్టరేట్’ చేపడుతున్నట్లు APWJF జిల్లా అధ్యక్షుడు మద్దయ్య యాదవ్ తెలిపారు. శనివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమాజం కోసం శ్రమిస్తున్న విలేకరుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని, ఈ పోరాటంలో జర్నలిస్టులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో APWJF, ఏపీ బీజేఏ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.
కొలిమిగుండ్లలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు!
కొలిమిగుండ్ల: నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని శ్రీ పెద్దమ్మ తల్లి సన్నిధిలో సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ నాయకులు గాంధీజీ స్ఫూర్తిని, ఆయన ఆదర్శాలను అక్కడ ఉన్న పిల్లలకు వివరించారు. మండల ధర్మ విస్తారక్ తిరుమలయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కన్వీనర్లు అడ్వకేట్ దస్తగిరి, గోపాలకృష్ణయ్య, లక్ష్మయ్య, వెంకటయ్య, గుడి పూజారి బాలాజీ మరియు స్థానిక చిన్నారులు పాల్గొన్నారు.
అచీవర్స్ స్కూల్‌లో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
నంద్యాల: పట్టణంలోని ఎన్‌జీఓస్ కాలనీలో గల అచీవర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్కూల్ కరస్పాండెంట్ వై. శ్రీనివాస్, ప్రిన్సిపాల్ ఎం.పి. లావణ్య మాట్లాడుతూ గాంధీజీ సత్యం, అహింసా మార్గం, శాస్త్రి గారి నిరాడంబరత, దేశభక్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ వై. వరలక్ష్మి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
మద్యం షాపుల దరఖాస్తులకు నేడే ఆఖరు తేదీ
ఆళ్లగడ్డ, అక్టోబర్ 30 (డిగ్నిటి న్యూస్): 2026-27 సంవత్సరానికి గాను ఆళ్లగడ్డ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని నూతన మద్యం పాలసీలో రెన్యూవల్ కాని 4 మద్యం షాపుల కేటాయింపునకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 1, 2026 నాడే చివరి తేదీ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ (నోడల్ ఆఫీసర్) టి. నాగలక్ష్మి వెల్లడించారు. బుధవారం కర్నూలు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పోతుల శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్. హనుమంతరావు,…
మద్యం షాపుల దరఖాస్తులకు నేడే ఆఖరు తేదీ
ఆళ్లగడ్డ, అక్టోబర్ 30 (డిగ్నిటి న్యూస్): 2026-27 సంవత్సరానికి గాను ఆళ్లగడ్డ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని నూతన మద్యం పాలసీలో రెన్యూవల్ కాని 4 మద్యం షాపుల కేటాయింపునకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 1, 2026 నాడే చివరి తేదీ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ (నోడల్ ఆఫీసర్) టి. నాగలక్ష్మి వెల్లడించారు. బుధవారం కర్నూలు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పోతుల శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్. హనుమంతరావు,…
