నందికొట్కూర్, అక్టోబర్ 7 (డిగ్నిటి న్యూస్): అనారోగ్యంతో వైద్య చికిత్సలు చేయించుకున్న పేద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ఎంతో ఉపయోగపడుతోందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పేర్కొన్నారు. పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ గ్రామంలో బుధవారం ఆయన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కట్టా బ్రహ్మానందరెడ్డికి రూ. 47,896, అప్పిరెడ్డిగారి నరసింహారెడ్డికి రూ. 1,57,000, రేవల్లి సత్యనారాయణకు రూ. 43,565 విలువైన చెక్కులను అందజేసి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 9వ జాతీయ పోషణ్ మాసోత్సవ కార్యక్రమంలో పాల్గొని బాలింతలకు శ్రీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పగిడ్యాల ఎంపీడీవో మేరీ, ఐసీడీఎస్ సీడీపీవో మంగవల్లి, టీడీపీ నాయకులు పుల్యాల రాజన్న, లోకానంద రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Uncategorized
బాధితులకు అండగా సీఎం సహాయనిధి: ఎమ్మెల్యే గిత్త జయసూర్య
ఈ QR కోడ్ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.
