DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
కొలిమిగుండ్లలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు!
Uncategorized

కొలిమిగుండ్లలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు!

02 Oct 2026, 11:30 AM   |   Dignity News

కొలిమిగుండ్ల: నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని శ్రీ పెద్దమ్మ తల్లి సన్నిధిలో సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ నాయకులు గాంధీజీ స్ఫూర్తిని, ఆయన ఆదర్శాలను అక్కడ ఉన్న పిల్లలకు వివరించారు. మండల ధర్మ విస్తారక్ తిరుమలయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కన్వీనర్లు అడ్వకేట్ దస్తగిరి, గోపాలకృష్ణయ్య, లక్ష్మయ్య, వెంకటయ్య, గుడి పూజారి బాలాజీ మరియు స్థానిక చిన్నారులు పాల్గొన్నారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.