నంద్యాల: పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీలో గల అచీవర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్కూల్ కరస్పాండెంట్ వై. శ్రీనివాస్, ప్రిన్సిపాల్ ఎం.పి. లావణ్య మాట్లాడుతూ గాంధీజీ సత్యం, అహింసా మార్గం, శాస్త్రి గారి నిరాడంబరత, దేశభక్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ వై. వరలక్ష్మి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
Uncategorized
అచీవర్స్ స్కూల్లో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
ఈ QR కోడ్ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.
