DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
మంత్రి బీసీని మర్యాదపూర్వకంగా కలిసిన APWJF నాయకులు
Uncategorized

మంత్రి బీసీని మర్యాదపూర్వకంగా కలిసిన APWJF నాయకులు

04 Oct 2026, 06:37 AM   |   Dignity News

బనగానపల్లె: స్థానిక క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు భవనాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (APWJF) నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల ఎన్నికైన జిల్లా నాయకులు మద్దయ్య యాదవ్, నరసింహారెడ్డి, రామచంద్రారెడ్డి, జవహర్, షాషావలిలు మంత్రికి జ్ఞాపికను అందజేసి సన్మానించారు. అనంతరం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ మండల నాయకులు చంద్రశేఖర్, మధు, రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

📰
Bareed RamamohanReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.