సంజామల, సెప్టెంబర్ 30 (డిగ్నిటి న్యూస్): లోకకల్యాణార్థం, ప్రజలు సుభిక్షంగా ఉండాలనే సదుద్దేశంతో నంద్యాల జిల్లా సంజామల మండలం పేరుసోముల గ్రామంలోని శ్రీ విష్ణుకంటి క్షేత్రంలో శతచండి యాగం వైభవంగా పూర్తయింది. నూతనంగా నిర్మించిన శ్రీ మోక్ష లక్ష్మి నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో క్షేత్ర అధ్యక్షులు అవధూత రామ్మోహన్ స్వామి ఆధ్వర్యంలో శృంగేరి సంస్థానం ముఖ్య అర్చకులచే గత మూడు రోజులుగా (ఈ నెల 28 నుండి) నిర్వహించిన ఈ శతచండి హోమం బుధవారం మహా పూర్ణాహుతితో…
సౌభాగ్య పౌడర్ అమ్మితే జైలుకే!
కొలిమిగుండ్ల, సెప్టెంబర్ 28 (డిగ్నిటి న్యూస్): ఇంటి వాకిట చల్లే ‘సౌభాగ్య పౌడర్’ (పేడ పౌడర్) అమ్మకకాలపై కొలిమిగుండ్ల పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పౌడర్‌ను ఎవరైనా అమ్మినా, వాడినా వారిపై చట్టప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ షేక్ నగీనా హెచ్చరించారు. కొలిమిగుండ్ల పట్టణంలో వివిధ కిరాణా, పెట్టీ షాపుల్లో తనిఖీలు నిర్వహించిన అనంతరం, షాపుల యజమానులతో మాట్లాడి పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల…
అంధ గాయని స్వరానికి జాతీయ గౌరవం..!
అవార్డుకే దక్కిన నిజమైన గౌరవం::ప్రముఖ గాయని వైకోమ్ విజయలక్ష్మి జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించారు.72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్ అవార్డును అందుకున్నారు.2024లో విడుదలైన మలయాళ చిత్రం **‘అజాయంతే రండం మోషనం’ (ARM)**లోని ‘అంగు వాన కోనిలు’ పాటకు ఈ పురస్కారం దక్కింది.సెప్టెంబర్ 2026లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజయలక్ష్మి అవార్డును స్వీకరించారు.చూపు లేకపోయినా తన అద్భుతమైన గాత్రంతో సంగీత ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు…
రోప్ స్కిప్పింగ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో నల్లగొండ నారాయణ స్కూల్ విద్యార్థుల ఘనవిజయం
నల్లగొండ, ఆగస్టు 26 (డిగ్నిటి న్యూస్): రంగారెడ్డి జిల్లా అల్మాస్‌గూడలోని ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్ వేదికగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలలో నల్లగొండ పట్టణానికి చెందిన నారాయణ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి మొదటి ర్యాంకులతో సత్తా చాటారు. అండర్-10 విభాగంలో 4వ తరగతికి చెందిన అలేఖ్య, కైవల్య కేతన్ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాలు (మొదటి ర్యాంకులు) సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి…
ఘనంగా ‘శిల్పా మహిళా సహకార బ్యాంక్
నంద్యాలలో ఘనంగా ‘శిల్పా మహిళా సహకార బ్యాంక్’ ప్రారంభం!.. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి…నంద్యాల పట్టణంలోని పద్మావతినగర్ లో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ నూతన కార్యాలయం గురువారం అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి మరియు బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి నూతన కార్యలయాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ,…
కొలిమిగుండ్ల లో విషాదం..!
డిగ్నిటీ న్యూస్సె ప్టెంబర్ 24: కొలిమిగుండ్ల లో విషాదం .కొలిమిగుండ్లలో నీళ్ల కోసం బయటకు వెళ్లిన బోయ అజిత్ కుమార్ (8) తెరిచి ఉన్న లెట్రిన్ గుంతలో పడి ప్రాణాలు కోల్పోయాడు. వర్షపు నీటి వల్ల దారి కనిపించక నిర్మాణంలో ఉన్న భవనం గుంతలో పడిపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. నీళ్ల బాటిల్ ఆధారంగా బాలుడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మిట్నాల మారెమ్మ ఆలయ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు
సెప్టెంబర్ 17:మిట్నాల మారెమ్మ ఆలయ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలుఆదేశాలతో గ్రామంలో హర్షాతిరేకాలు.. పెద్ద పండుగలా సంబరాలుమిట్నాల, గ్రామంలోని శ్రీ మారెమ్మ దేవత ఆలయానికి సంబంధించిన భూముల వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలు వెలువడటంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ భూములకు రక్షణ లభించనుందనే ఆశాభావంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు ఆలయం వద్ద ప్రత్యేకంగా పూజలు నిర్వహించి, తమ సంతోషాన్ని పంచుకున్నారు.ఆలయానికి సంబంధించిన సర్వే నంబర్లు 91/1, 91/3 భూముల…
పోలీసుల తీరుపై ఆగ్రహం..!
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి (Galla Madhavi) ఓ బాధితురాలైన మహిళను వెంటబెట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం మరియు పోలీసులను నిలదీయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ముఖ్యమైన వివరాలు: • నేపథ్యం: భర్త వేధింపుల కారణంగా ఇద్దరు చిన్న పిల్లలతో ఇల్లు లేకుండా కష్టాల్లో ఉన్న ఓ మహిళ తనను ఆశ్రయించగా, ఎమ్మెల్యే గల్లా మాధవి స్వయంగా స్పందించారు. • పోలీసుల తీరుపై ఆగ్రహం: బాధితురాలు ఇదివరకే కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే పోలీసులు…
తాడాకాచుపిస్తా తగ్గేదే లే..!
🌧️ రుతుపవనాల వీడ్కోలు వేళ.. వర్షాల హై అలర్ట్!20 రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల అవకాశం!న్యూఢిల్లీ: దేశంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైన వేళ వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రుతుపవనాల వీడ్కోలు మొదలైనప్పటికీ.. బంగాళాఖాతంలో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పుల ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.సెప్టెంబర్ 19న పశ్చిమ రాజస్థాన్ ప్రాంతం నుంచి నైరుతి…
ఏపీడబ్ల్యూజేఎఫ్ నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శిగా రామారావు యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక!
నంద్యాల, సెప్టెంబర్ 20 (డిగ్నిటి న్యూస్): ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్), ఏపీ బ్రాడ్‌కాస్టింగ్ జర్నలిస్టు అసోసియేషన్ నంద్యాల జిల్లా ప్రథమ మహాసభలు ఆదివారం శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి.అనంతరం నిర్వహించిన ప్రతినిధుల సభలో నంద్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రముఖ దినపత్రిక ‘డిగ్నిటి న్యూస్’ ఎడిటర్ చిర్రబోయిన రామారావు యాదవ్ ఏపీడబ్ల్యూజేఎఫ్ నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా…








