RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

దళితులపై జగన్‌ పాలనలో దాడులు పెరిగాయి: టిడిపి

​నంద్యాల, మే 19 (డిగ్నిటి న్యూస్): వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఎన్‌ఎండీ ఫిరోజ్‌తో పాటు పలువురు దళిత నాయకులు మాట్లాడారు. ​గత టీడీపీ పాలనలో ఎస్సీలపై 8,211 దాడులు నమోదైతే, వైసీపీ హయాంలో ఆ సంఖ్య ఏకంగా 56,981కు చేరిందని వారు ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను దారిమళ్లించి దళితులకు తీవ్ర అన్యాయం…

సుందరయ్య నేటి తరానికి ఎంతో ఆదర్శం

ఘనంగా 41వ వర్ధంతి నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 19. (డిగ్నిటీ న్యూస్). స్వాతంత్ర సమరయోధులు దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి ఎంతో ఆదర్శనీయమని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు.మంగళవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా 42,47వ డివిజన్ ఆర్టీసీ కాలనీలో తుమ్మల వీరారెడ్డి ,…

గోవిందపల్లి మెట్ట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం గోవిందపల్లి మెట్ట సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రుద్రవరం నుంచి నంద్యాల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, కామరాజనపల్లె రోడ్డువైపు వెళ్తున్న పెద్దసిద్దయ్య ప్రయాణిస్తున్న మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెద్దసిద్దయ్య తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సిరివెళ్ల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఖరీఫ్ సన్నద్ధతపై వ్యవసాయ అధికారుల సమీక్ష

నంద్యాల, మే 18 (డిగ్నిటి న్యూస్): రాబోయే ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై నంద్యాల మండల వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రాల సిబ్బంది, విస్తరణ అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది ఖరీఫ్‌లో ఎల్ నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇందుకోసం 25 నుంచి 30 రకాల విత్తనాలతో కూడిన ప్రత్యేక కిట్లను…

నిశ్శబ్ద పోరాటం

వాస్తవ పరిస్థితి ​ పట్టణంలో ఉన్న మెడికల్ షాపుల యజమానుల మనసుల్లో మాత్రం ఒక తెలియని అలజడి. నా షాపు ముందు నిలబడి 1997 నుండి మారుతున్న కాలాన్ని గమనిస్తున్న నాకు నా మెడికల్ షాప్ మరియు, మెడికల్ ఏజెన్సీ వాస్తవ పరిస్థితి నా లాగా ఎందరో​మాయమవుతున్న ‘చిన్న’ ఉనికి….. ​ఐదేళ్ల క్రితం వరకు పరిస్థితి వేరు. షాపుకు వచ్చే కస్టమర్లతో ఒక ఆత్మీయ అనుబంధం ఉండేది. కానీ ఇప్పుడు? కార్పొరేట్ మెడికల్ చైన్ షాపుల రాకతో…

మాది రైతు పక్షపాతి ప్రభుత్వం

రబీలో రైతులు పండించిన చివరి గింజ వరకు మద్దతు ధర చెల్లించి కొంటాం ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నాం 4600 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో వేశాం- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వెల్లడి నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 14 (డిగ్నిటీ న్యూస్): దేశంలో వరి పండించడంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్….

జనాభా గణనకు సహకరించాలి: మేయర్, కలెక్టర్

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 14 (డిగ్నిటి న్యూస్): నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సాగుతున్న జనాభా గణన గృహ జాబితా నమోదు ప్రక్రియకు ప్రజలందరూ పూర్తిస్థాయిలో సహకరించాలని నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ బడుగుల చంద్రశేఖర్ కోరారు. గురువారం నాడు మేయర్, కలెక్టర్, జిల్లా న్యాయమూర్తి నివాసాల్లో ఎన్యుమరేటర్లు గృహ వివరాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగర పరిధిలో ఏర్పాటు చేసిన 349 ఎన్యుమరేషన్ బ్లాకుల…

పేదింటి ఆడబిడ్డలకు అండగా కళ్యాణ లక్ష్మి

నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 14 (డిగ్నిటీ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహాలకు కొండంత అండగా నిలుస్తున్నాయని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 64 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ…

వ్యాపార సంస్థలను ప్రారంభించిన ఎమ్మెల్యే వీరేశం

నకిరేకల్, మే 14 (డిగ్నిటి న్యూస్): నకిరేకల్ నియోజకవర్గంలో పలు నూతన వ్యాపార సంస్థలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం ప్రారంభించారు. కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామ సర్పంచ్ చింత విజయ-కృపాకర్ నూతనంగా కొనుగోలు చేసిన ట్రాక్టరును ఆయన పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం నకిరేకల్ పట్టణ కేంద్రంలోని వినాయక ఫ్యామిలీ రెస్టారెంట్‌కు ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు నాణ్యమైన ఆహారంతో పాటు…

గొల్లగూడెంలో మిన్నంటనున్న మల్లికార్జునుడి జాతర సంబరాలు

నకిరేకల్, మే 14 (డిగ్నిటి న్యూస్): నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని గొల్లగూడెం గ్రామం భక్తి సాగరంలో మునిగిపోనుంది. ఈనెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న శ్రీ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవానికి గ్రామస్థులు సర్వం సిద్ధం చేశారు. రెండేళ్లకోసారి అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవానికి వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. వేడుకగా స్వామివారి కళ్యాణం జాతరలో భాగంగా సోమవారం నాడు శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా…

Exit mobile version