RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

దళితులపై జగన్‌ పాలనలో దాడులు పెరిగాయి: టిడిపి

నంద్యాల, మే 19 (డిగ్నిటి న్యూస్): వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఎన్‌ఎండీ ఫిరోజ్‌తో పాటు పలువురు దళిత నాయకులు మాట్లాడారు.

​గత టీడీపీ పాలనలో ఎస్సీలపై 8,211 దాడులు నమోదైతే, వైసీపీ హయాంలో ఆ సంఖ్య ఏకంగా 56,981కు చేరిందని వారు ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను దారిమళ్లించి దళితులకు తీవ్ర అన్యాయం చేశారని, డాక్టర్‌ సుధాకర్, డ్రైవర్‌ సుబ్రమణ్యం, డాక్టర్‌ అచ్చెన్న ఘటనలే ఇందుకు ఉదాహరణలని విమర్శించారు. అన్నమయ్య జిల్లాలో ఎంపీడీవో జవహర్‌బాబుపై జరిగిన దాడి వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందన్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే జగన్‌కు దళితుల సంక్షేమం గుర్తుకొస్తుందని, అధికారంలోకి వచ్చాక వారిని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. దళితులకు ద్రోహం చేసిన నాయకుడిగా జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని వారు వ్యాఖ్యానించారు.

https://dignitynews.in/wp-content/uploads/2026/05/1001556863.mp4
https://dignitynews.in/wp-content/uploads/2026/05/1001556888.mp4

CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully
Exit mobile version