RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

వ్యాపార సంస్థలను ప్రారంభించిన ఎమ్మెల్యే వీరేశం

నకిరేకల్, మే 14 (డిగ్నిటి న్యూస్): నకిరేకల్ నియోజకవర్గంలో పలు నూతన వ్యాపార సంస్థలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం ప్రారంభించారు. కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామ సర్పంచ్ చింత విజయ-కృపాకర్ నూతనంగా కొనుగోలు చేసిన ట్రాక్టరును ఆయన పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం నకిరేకల్ పట్టణ కేంద్రంలోని వినాయక ఫ్యామిలీ రెస్టారెంట్‌కు ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు నాణ్యమైన ఆహారంతో పాటు మెరుగైన సేవలు అందిస్తూ వ్యాపారపరంగా అభివృద్ధి చెందాలని నిర్వాహకులను కోరారు.

అదేవిధంగా పట్టణంలో మాచర్ల సతీష్ ఏర్పాటు చేసిన శ్రీ మణికంట డీజి ప్రెస్ ను కూడా ఎమ్మెల్యే ప్రారంభించి యజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully
Exit mobile version