పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . మే 27 ( డిగ్నిటీ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక ప్రాధ్యానత ఇస్తున్నదని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ అన్నారు.బుధవారం ఆయన చిట్యాల మండలం, చిన్నకాపర్తి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, జల శక్తి అభియాన్ జనసంచాయ్–జన్ భాగీదారి కార్యక్రమాలను పరిశీలించారు. అంతేకాక
ఉపాధి కూలీలతో మాట్లాడి పనులు ఎలా జరుగుతున్నాయని? వేతనాలు సమయానికి అందుతున్నాయా? అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారా? అనిఅడిగి తెలుసుకున్నారు.ఉదయం 7 గంటల నుంచి పనులు చేస్తున్నామని, రోజుకు సుమారు రూ.300 వరకు కూలి అందుతోందని మహిళ కూలీలు తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ చీప్ సెక్రటరీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 16.20 లక్షల మంది ఉపాధి హామీ కూలీలు పనిచేస్తుండగా, నల్గొండ జిల్లాలో 1.20 లక్షల మంది పనిచేస్తున్నారని అన్నారు. ఉపాధి కూలీల నమోదులో రాష్ట్రంలో ముందంజలో ఉన్న నల్గొండ జిల్లాను జిల్లా కలెక్టర్ ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. మహిళా సంఘాలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించేలా ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.870 కోట్లు, మహిళల కోసం ఆర్టీసీ బస్సుల నిర్వహణకు రూ.1300 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అన్ని గ్రామపంచాయతీ భవనాలను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
చిన్నకాపర్తి చెరువును పరిశీలించి,ఉపాధి పనుల్లో తీస్తున్న మట్టిని రైతుల పొలాల్లో వేయడం వల్ల భూమి సారవంతం అవుతుందని తెలిపారు. గ్రామాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి గ్రామపంచాయతీ నిధులను వినియోగించాలని తెలిపారు. గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతి నెల మొదటి తేదీన జీతాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.
జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంకుడు గుంతల నిర్మాణంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని , చిన్నకాపర్తి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని, ప్రస్తుతం ఉన్న 800 కుటుంబాల్లో ఉపాధి హామీ కూలీల సంఖ్యను 500కు పెంచాలని చెప్పారు.
గ్రామపంచాయతీ నర్సరీని సందర్శించి ద్రాక్ష, కాకర, చింత, అశ్వగంధ, కరివేపాకు, నేరేడు, బాదం, రాగి, మామిడి వంటి మొక్కలను పరిశీలించారు. గ్రామంలో రహదారులు, హెల్త్ సెంటర్, మహిళా సంఘాల భవనాల నిర్మాణ పనులను కూడా పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ చిన్నకాపర్తి గ్రామంలో ఉపాధి పథకాల అమలుపై ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. ఉపాధి కూలీలకు తాగునీరు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు , టెంట్లు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో జిల్లాకు జాతీయ అవార్డు రావడం గర్వకారణమన్నారు. జలసంచాయ్ జన భాగీ దారి పథకంపై మే 11 నుంచి జూన్ 10 వరకు ఆరు నియోజకవర్గాల్లో నాలుగు బృందాలతో ప్రచార రథాలు తిరుగుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయని తెలిపారు.స్పెషల్ కమిషనర్ లక్ష్మి, జాయింట్ కమిషనర్ నరసింహులు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, ఏపీ డి నరసింహారావు, జిల్లా సమాక్య అధ్యక్షురాలు మాధవి, గ్రామ సర్పంచ్ సుందర్ ,స్పెషల్ చీఫ్ సెక్రటరీ వెంట ఉన్నారు
