RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

ఎస్.కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు

పాణ్యం, మే 10: నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఎస్.కొత్తూరులోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నారాయణ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. సర్పసూక్త పారాయణంతో కూడిన మహాభిషేకం, మహానివేదన మరియు మంగళహారతులు శాస్త్రోక్తంగా జరిగాయి. సుమారు 400 మంది భక్తులు స్వామివారికి వ్యక్తిగత అభిషేకాలు నిర్వహించుకోగా, అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు.ప్రతి మంగళవారం రాహుకాల సమయంలో (మధ్యాహ్నం 3:00 నుండి 4:30 గంటల వరకు) సంతానం లేని వారు, వివాహం ఆలస్యమవుతున్న వారు మరియు ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించి 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఆలయ అర్చకులు ఈ సందర్భంగా తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

CHIRRABOINA RAMA RAO YADAV
CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully