నంద్యాల విద్యుత్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభం

నంద్యాల, మే 4 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): నంద్యాల పట్టణంలోని నూనెపల్లె విద్యుత్ కార్యాలయ ఆవరణలో గోళ్ల రాజేష్ ఆధ్వర్యంలో, కౌలు రైతుల సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సోమవారం విద్యుత్ శాఖ డీఈలు శ్రీనివాస్, నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవిలో ఎండ తీవ్రత దృష్ట్యా బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.

ముఖ్యంగా జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే సామాన్య ప్రజలకు ఈ ఉచిత చలివేంద్రం ఎంతో ఊరటనిస్తుందని పేర్కొన్నారు. నిర్వాహకులు రిపోర్టర్ నూర్ భాషా మాట్లాడుతూ విద్యుత్ కార్యాలయ ప్రాంగణంలో చలివేంద్రం ఏర్పాటుకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో గోళ్ల రాజేష్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా నాయకులు నర్సింహులు, మార్కు, ఏలియా, ఓబ్లేసుతో పాటు మదిన్ షావలి, మహబూబ్, హాజి సలాం తదితరులు పాల్గొన్నారు.

Translate »