గాలివాన అనంతరం పారిశుధ్య పనులు అత్యవసరంగా చేపట్టాలి. మంత్రి, మేయర్ ఆదేశాలు

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి మే 4 (డిగ్నిటీ న్యూస్).నిన్న సంభవించిన గాలివాన ప్రభావంతో నల్గొండ నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడడం, ఫ్లెక్సీలు , బ్యానర్లు కూలిపోవడం, డ్రైన్లు మూసుకుపోవడం వంటి సమస్యలు తలెత్తిన నేపథ్యంలో, నగర పారిశుధ్య పరిస్థితిని సమీక్షించేందుకు మున్సిపల్ కమిషనర్ బి. శరత్ చంద్ర సోమవారం ఉదయం 36వ , 37వ డివిజన్లలో పర్యటించారు.ఈ సందర్భంగా రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి , మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వెంటనే శుభ్రత పనులను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేయడం జరిగింది.పర్యటనలో భాగంగా కమిషనర్ సంబంధిత డివిజన్లలో రోడ్ స్వీపింగ్, డ్రైన్లలో సిల్ట్ తొలగింపు, డోర్ టు డోర్ చెత్త సేకరణ కార్యక్రమాలను పరిశీలించారు. గాలివాన కారణంగా పడిపోయిన చెట్ల కొమ్మలు, ఫ్లెక్సీలు బ్యానర్లను తక్షణమే తొలగించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రహదారులను శుభ్రపరచాలని ఆదేశించారు. నగరంలోని నీరు నిల్వ అయ్యే ప్రాంతాలను గుర్తించి వెంటనే క్లియర్ చేయాలని, డ్రైన్లలో పేరుకుపోయిన సిల్ట్‌ను పూర్తిగా తొలగించి, అన్ని డ్రైన్లు స్వేచ్ఛగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ అన్ని శానిటరీ జవాన్లకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే గల్ఫర్ యంత్రాల సహాయంతో బ్లాక్ అయిన డ్రైన్లను క్లియర్ చేయాలని సూచించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని, నగరంలోని అన్ని ప్రధాన మరియు ఉప డ్రైన్లను అత్యవసరంగా డిసిల్టింగ్ చేసి, నీరు నిల్వ కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కమిషనర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ జి. శ్రీనివాస్ , శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్. ప్రదీప్ రెడ్డి , శానిటరీ జవాన్లు, సంబంధిత వార్డు అధికారులు , మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Translate »