నంద్యాల, మే 10 (డిగ్నిటి న్యూస్): పట్టణంలోని శ్రీ కేదారేశ్వరి దేవి సమేత శ్రీ ప్రమధనందీశ్వర స్వామి దేవస్థాన అనుబంధ నూతన అన్నదాన సత్రం గదుల ప్రారంభోత్సవ పోస్టర్‌ను రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదివారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం నిర్మించిన ఈ గదులను ఈ నెల 15న ఉదయం 8:30 గంటలకు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మెరుగైన వసతుల కల్పనలో దాతల సహకారం అభినందనీయమని మంత్రి కొనియాడారు. ఆలయ కమిటీ చైర్మన్ చలం బాబు మాట్లాడుతూ గదుల నిర్మాణానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రారంభోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రముఖులు పాల్గొన్నారు.
కేదారేశ్వరి అన్నదాన సత్రం గదుల పోస్టర్ ఆవిష్కరణ
