RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

సమస్యలపై అర్జీలు అందజేయాలి: ఎంపీడీవో భాగ్యలక్ష్మి

ప్రజల ముంగిటకే పరిష్కార వేదిక

రుద్రవరం, మే 4 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) భాగ్యలక్ష్మి తెలిపారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అన్ని శాఖల అధికారులతో కలిసి ఈ వేదిక అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.మండల పరిధిలోని ప్రజలు తమ వ్యక్తిగత లేదా సామాజిక సమస్యలపై నేరుగా వచ్చి అర్జీలు అందజేయవచ్చని ఆమె సూచించారు. ఆయా వినతులను సంబంధిత శాఖల అధికారులకు బదిలీ చేసి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ఇది ఒక మంచి అవకాశమని, మండల ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

CHIRRABOINA RAMA RAO YADAV
CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully