పోక్సో కేసు నిందితుడికి ‘వెలుగు’ నీడలు? కటకటాల్లో ఏపీఎం.. ఆఫీసులో లీవ్ లెటర్లు! ఎఫ్‌ఐఆర్ చేరలేదంటున్న అధికారులు.. వ్యవస్థలపై అనుమానాల మబ్బులు నంద్యాల, జూన్ 13 (డిగ్నిటి న్యూస్): బాలికపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టై జైలులో ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగి పేరుతో… ప్రభుత్వ కార్యాలయంలో మాత్రం ‘టైఫాయిడ్ జ్వరం’ పేరుతో మెడికల్ లీవ్ దరఖాస్తు దర్శనమివ్వడం నంద్యాల జిల్లా డీఆర్డీఏ (వెలుగు) విభాగంలో కలకలం రేపుతోంది. వ్యవస్థలను మభ్యపెట్టేందుకు కొందరు చేతులు కలిపారా? లేక…
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ
రంగనాథ్‌కు రూ.50 వేల జరిమానా విధించిన తెలంగాణ హైకోర్టు జరిమానా కడితేనే అఫిడవిట్ అంగీకరించాలని రిజిస్ట్రీకి ఆదేశాలు హైదరాబాద్ జిల్లా ఖైరతాబాద్ మండలం యూసుఫ్‌గూడ పరిధిలోని సర్వే నంబర్ 45(హనుమాన్ టెంపుల్ వెనుక)లో ఉన్న భూమిపై స్టేటస్ కో ఉన్నప్పటికీ, కాంపౌండ్ వాల్ కూలగొట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, బోర్డు ఏర్పాటు చేసిన హైడ్రా కౌంటర్ దాఖలు చేసేందుకు చివరి అవకాశం ఇచ్చినా పట్టించుకోకుండా, కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జరిమానా విధించిన తెలంగాణ…
నంద్యాలలో వెన్నుపోటుకు రెండేళ్లు పేరిట మాజీ ఎమ్మెల్యే శిల్ప రవి రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ
నంద్యాలలో వైసీపీ భారీ ర్యాలీ కూటమి ప్రభుత్వంపై శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ధ్వజం మహానేత విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించి తీరుతామని సవాల్ నంద్యాల, జూన్ 12 (డిగ్నిటి న్యూస్): కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నంద్యాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట గురువారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి పిలుపు మేరకు స్థానిక శిల్పా కార్యాలయం నుండి…
జీపీ కార్మికుల హామీలను వెంటనే అమలు చేయాలి
జీపీ కార్మికుల హామీలను వెంటనే అమలు చేయాలి కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో భారీ ధర్నా నల్గొండ టౌన్, జూన్ 12 (డిగ్నిటి న్యూస్): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్ డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం నల్గొండ కలెక్టరేట్ ఎదుట కార్మికులు…
గాలివాన బీభత్సం: నకిరేకల్ పరిధిలో రేకులు లేచిపోయి.. చెట్లు విరిగిపడి జనం బేజారు
రాత్రంతా చీకట్లోనే ప్రజల జాగారం.. ఉక్కపోత, దోమలతో తీవ్ర అవస్థలు నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తుల డిమాండ్ నకిరేకల్/గొల్లగూడెం, జూన్ 11 (డిగ్నిటి న్యూస్): నియోజకవర్గ పరిధిలో గురువారం కురిసిన భారీ వర్షం, గాలివాన తీవ్ర బీభత్సం సృష్టించాయి. గొల్లగూడెం గ్రామంలో ఈదురు గాలుల ధాటికి కొమ్మనబోయిన రమేష్ ఇంటి పైకప్పు రేకులు పూర్తిగా లేచిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందుల పాలైంది. అలాగే గ్రామానికి చెందిన చిర్రబోయిన రామారావు ఇంటి పైకప్పు కూడా గాలివానకు…
ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలి
వీఆర్‌వో హుస్సేన్ ఆత్మహత్యకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి: ఏపీజీఈఏ నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప నంద్యాల, జూన్ 11 (డిగ్నిటి న్యూస్): రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న వీఆర్‌వోలు, విలేజ్ సర్వేయర్లు, వీఆర్‌ఏలపై అధికారులు అదనపు పనుల పేరిట తీవ్ర పని ఒత్తిడి పెంచుతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కర్నూలు జిల్లా వెంకయ్యపల్లెకు చెందిన వీఆర్‌వో మహమ్మద్ హుస్సేన్ అనారోగ్య కారణాల వల్ల…
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొల్లు బాలకృష్ణ
నాంపల్లిలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ ఎన్నిక: పలువురి అభినందనలు నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, జూన్ 11 (డిగ్నిటీ న్యూస్): తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నల్లగొండ జిల్లాకు చెందిన కొల్లు బాలకృష్ణ ఎన్నికయ్యారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవోస్ యూనియన్ సెంట్రల్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన రాష్ట్ర వసతి గృహ సంక్షేమ అధికారుల సర్వసభ్య సమావేశంలో ఈ ఎంపిక జరిగింది. టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి…
పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి
నేర నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, జూన్ 11 (డిగ్నిటీ న్యూస్): జిల్లాలో నమోదవుతున్న వివిధ నేరాలపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తూ, పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నిర్వహించిన క్రైమ్ రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో దొంగతనాల…
రూ.450 కోట్లతో ఎస్‌ఎల్‌బీసీ కాల్వ లైనింగ్ పనులు
ఈ నెల 17న సీఎం రేవంత్‌రెడ్డి నల్లగొండ పర్యటన: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, జూన్ 11 (డిగ్నిటీ న్యూస్): నల్లగొండ మండలం గుండ్లపల్లి గ్రామ సమీపంలో రూ.450 కోట్లతో కొనసాగుతున్న ఎస్‌ఎల్‌బీసీ కాల్వ లైనింగ్ పనులను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత గడువులోగా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను…
ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య శిబిరం
శాంతిరామ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో పరీక్షలు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి: ఆర్గనైజర్ ఉరుకుందప్ప నంద్యాల, జూన్ 11 (డిగ్నిటి న్యూస్): స్థానిక తెలుగు గంగా కార్యాలయంలో శాంతిరామ్ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తెలుగు గంగా కార్యాలయ సూపర్డెంట్ డి. ప్రసాదరావు సహకారంతో ఈహెచ్ఎస్ (EHS) ద్వారా ఈ ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ…
