RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య శిబిరం

శాంతిరామ్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో పరీక్షలు

ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి: ఆర్గనైజర్ ఉరుకుందప్ప

నంద్యాల, జూన్ 11 (డిగ్నిటి న్యూస్): స్థానిక తెలుగు గంగా కార్యాలయంలో శాంతిరామ్‌ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తెలుగు గంగా కార్యాలయ సూపర్డెంట్ డి. ప్రసాదరావు సహకారంతో ఈహెచ్ఎస్ (EHS) ద్వారా ఈ ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా శాంతిరామ్‌ ఆసుపత్రి కంటి విభాగం ఆర్గనైజర్ ఉరుకుందప్ప మాట్లాడుతూ.. ఈ శిబిరంలో ఇప్పటివరకు 35 మందికి పైగా ఉద్యోగులకు కంటి పరీక్షలు నిర్వహించామని తెలిపారు.

వారిలో ఐదుగురికి శుక్లాలు, ఇద్దరికి కంటి పొరలు ఉన్నట్లు గుర్తించామన్నారు. మిగతా వారికి అవసరమైన మందులు, అద్దాలను అందజేశామని పేర్కొన్నారు. ఈహెచ్ఎస్ హెల్త్ కార్డూ ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగితో పాటు వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయడం జరుగుతుందని, కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

https://dignitynews.in/wp-content/uploads/2026/06/1002015773.mp4
https://dignitynews.in/wp-content/uploads/2026/06/1002015718.mp4

CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully
Exit mobile version