RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తున్నాం

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాలు ఆర్థికంగా మరోసారి కల్పిస్తున్నాం. ప్రభుత్వ విప్పు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .మే 5 (డిగ్నిటీ న్యూస్) సాయిబాబా మందిర్ లో నకిరేకల్, కేతపల్లి,కట్టంగూర్ మండలాల లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మంగళవారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ “రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న…

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న మోసాలను అరికట్టాలి

మిల్లర్ల దోపిడీని నివారించి,లారీల కొరతను తీర్చి రైతన్నలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం తెలంగాణ రైతు సంఘం నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .మే 5 .(డిగ్నిటీ న్యూస్) ఐకెపి,పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న మోసాలను అరికట్టి 42 కేజీల తూకం, మిల్లర్ల దోపిడీని నివారించుటకై, లారీలను సక్రమంగా రవాణా చేయుట గూర్చి తెలంగాణ రైతు సంఘం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడం…

నకిరేకల్‌లో రూ.6 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

ప్రభుత్వ విప్ వేముల వీరేశం. నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .మే 5. (డిగ్నిటీ న్యూస్): నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.6 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు డ్రైనేజీ పనులకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు.అదేవిధంగా ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం కోసం మరో 20 లక్షలు కేటాయించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో నకిరేకల్‌లో…

జీవిత భాగస్వామి ఆదాయ వివరాలు ఆర్టీఐ కింద పొందలేరు: ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!!!

సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తి తన జీవిత భాగస్వామికి సంబంధించిన ఆదాయ వివరాలు పొందలేరని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. సమాజానికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడం ఆర్టీఐ చట్టం ఉద్దేశం కాదని.. బలమైన ప్రజాప్రయోజనం ఉంటే తప్ప ఒక వ్యక్తికి సంబంధించిన ఆదాయ పన్ను వివరాలు ఇతరులకు అందించకూడదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆ వివరాలను థర్డ్ పార్టీకి (జీవిత భాగస్వామితో సహా) వెల్లడించడం వారి వ్యక్తిగత గోప్యతా…

తమిళనాట తండ్రీకొడుకులపై ఎందుకింత వ్యతిరేకత..

తమిళనాడు రాజకీయ యవనికపై పెను సంచలనం నమోదవుతోంది. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల కోటగా ఉన్న ఈ రాష్ట్రంలో మునుపెన్నడూ చూడని విధంగా రాజకీయ సమీకరణాలు తారుమారవుతున్నాయి.ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సరళిని గమనిస్తే, అధికార కూటమికి ప్రజలు ఊహించని షాక్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ వంటి అగ్రనేతలు తమ సొంత నియోజకవర్గాల్లోనే వెనుకంజలో ఉండటం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ద్రవిడ కోటలో ప్రకంపనలు…..

సమస్యలపై అర్జీలు అందజేయాలి: ఎంపీడీవో భాగ్యలక్ష్మి

ప్రజల ముంగిటకే పరిష్కార వేదిక రుద్రవరం, మే 4 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) భాగ్యలక్ష్మి తెలిపారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అన్ని శాఖల అధికారులతో కలిసి ఈ వేదిక అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.మండల పరిధిలోని…

చుక్కల భూమి క్రమబద్ధీకరణకు రూ. 50 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన వైనం

ఏసీబీ వలలో బనగానపల్లె తహశీల్దార్‌, సర్వేయర్‌ బనగానపల్లె, మే 5 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): అవినీతి రహిత పాలన అందించాలన్న ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి, రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దండుకుంటున్న అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పంజా విసిరింది. చుక్కల భూమిని పట్టా భూమిగా మార్చేందుకు లంచం డిమాండ్‌ చేసిన బనగానపల్లె తహశీల్దార్‌ రాజీవ్‌ రెడ్డి, మండల సర్వేయర్‌ హుస్సేన్‌ బాషాను ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పథకం…

సినీ ప్రపంచం నుంచి రాజకీయ రంగం వరకూ… విజయ్ ప్రయాణం సంచలనం!

చెన్నై, మే 04 (డిగ్నిటి న్యూస్): 1974 జూన్ 22న జన్మించిన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ (విజయ్) చిన్ననాటి నుంచే సినీ వాతావరణంలో పెరిగారు. ఆయన తండ్రి ఎస్. ఏ. చంద్రశేఖర్ ప్రముఖ దర్శకుడు కాగా, తల్లి శోభా చంద్రశేఖర్ గాయని. దీంతో నటనపై ఆసక్తి సహజంగానే పెరిగింది.చెన్నైలోని ఫాతిమా మ్యాట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తిచేసిన విజయ్, తరువాత లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్‌లో చేరాడు. అయితే నటనపై మక్కువతో చదువును మధ్యలోనే…

సాగునీటి ప్రాజెక్టుల జాప్యంపై టీఆర్ఎస్ పోరు

హైదరాబాద్‌, మే (డిగ్నిటి న్యూస్): రంగారెడ్డి – పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ఈనెల 8న భారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై చర్చించారు. అనంతరం పాండురంగారెడ్డి మాట్లాడుతూ…..

Exit mobile version