RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తున్నాం

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాలు ఆర్థికంగా మరోసారి కల్పిస్తున్నాం.

ప్రభుత్వ విప్పు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .మే 5 (డిగ్నిటీ న్యూస్) సాయిబాబా మందిర్ లో నకిరేకల్, కేతపల్లి,కట్టంగూర్ మండలాల లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మంగళవారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ “రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయి అన్నారు . అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తున్నామని అన్నారు . ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక భారం కాకుండా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా రూ.1,00,116 ఆర్థిక సాయం అందిస్తున్నాం” అని తెలిపారు.లబ్ధిదారులు ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పథక లబ్ధిదారులు పాల్గొన్నారు.

Chintha Yadaiah
Reporter
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully
Exit mobile version